Page Loader
PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం 
PSLV-C56: పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం

PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం 

వ్రాసిన వారు Stalin
Jul 30, 2023
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో రికార్డు సృష్టించింది. శ్రీహరికోట నుంచి సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను ఉదయం 6:30 గంటలకు ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. PSLV-C56 మొత్తం ఏడు ఉపగ్రహాలను వాటి కక్ష్యలోకి ఖచ్చితంగా ప్రవేశపెట్టింది. జూలై 14న చంద్రయాన్-3 మిషన్‌ను ప్రయోగించింది. ఆ తర్వాత రెండు వారాల వ్వవధిలోనే భారత అంతరిక్ష సంస్థ చేసిన రెండో అతిపెద్ద మిషన్ ఇది. ఇస్రో ప్రయోగించిన ఏడింటిలో 'డీఎస్-ఎస్ఏఆర్-DS SAR' ఉపగ్రహం అనేది చాలా కీలకమైనది. దీన్ని సింగపూర్‌కు చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ ద్వారా పంపారు. ఈ ఉపగ్రహం పనిచేయడం ప్రారంభించిన తర్వాత, మ్యాపింగ్, వాతావరణ మార్పుల విషయంలో సింగపూర్ ప్రభుత్వానికి ఇది సహాయపడుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో ప్రయోగం