
Donald Trump: అమెరికా వాణిజ్య యుద్ధం దెబ్బ.. ఆపిల్ ఐఫోన్ ధరలకు రెక్కలు..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య పోరు ప్రభావం ఆపిల్ కంపెనీపై తీవ్రంగా పడనుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఐఫోన్‌ల ధరలు మరింతగా పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, మోడల్‌ను బట్టి ఐఫోన్ ధరలు 30 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశముందని చెబుతున్నారు.
ఎందుకంటే ఐఫోన్‌ల ఉత్పత్తి ప్రధానంగా చైనాలో జరుగుతుంది. ట్రంప్ విధించిన తాజా టారిఫ్‌లు చైనాలో తయారయ్యే వస్తువులపై పడుతాయి కాబట్టి, ఈ ప్రభావం ఐఫోన్‌లపై పడతాయి.
వివరాలు
ఐఫోన్ 16మోడల్ ధర రూ.97,000
ఇందులో ఆపిల్ సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలోకి వచ్చింది.టారిఫ్ భారాన్ని సంస్థ భరించాలా? లేక వినియోగదారులపై వేయాలా? అనే అంశంలో దృష్టి పెట్టాలి.
ప్రస్తుతం అందరికీ సులభంగా అందుబాటులో ఉండే ఐఫోన్ 16మోడల్ ధర సుమారు 799అమెరికన్ డాలర్లు (అంటే సుమారు రూ.68,000).
కానీ ఈ పన్నుల భారం వినియోగదారులకే బదలాయిస్తే,ఇదే మోడల్ ధర 1,142 డాలర్ల (రూ.97,000) దాకా పెరిగే అవకాశం ఉంది.
ఇక హై-ఎండ్ వర్షన్ అయిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్(1TB స్టోరేజ్ వేరియంట్)ధర రూ.2 లక్షల మార్క్‌ను దాటే అవకాశముంది (సుమారు $2,300).
గతంలో ఆపిల్ సంస్థకు కొన్ని ప్రత్యేక మినహాయింపులు లభించి పన్నుల భారాన్ని తగ్గించుకోగలిగింది. కానీ ఈసారి అటువంటి రాయితీలు లభించకపోవచ్చు.
వివరాలు
ధరలు మరింతగా పెరిగితే, వినియోగదారుల ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం
ట్రంప్ వాణిజ్య విధానాల కారణంగా అమెరికా కంపెనీలు చైనాలో ఉన్న తమ ఉత్పత్తి కేంద్రాలను ఇతర దేశాలకు తరలించేందుకు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.
మరోవైపు, ఇప్పటికే ఐఫోన్‌ల అమ్మకాలు ముఖ్య మార్కెట్లలో ఆశించిన స్థాయిలో లేవు.
ఈ పరిస్థితుల్లో ధరలు మరింతగా పెరిగితే, వినియోగదారుల ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ఫలితంగా, వారు ప్రత్యామ్నాయ బ్రాండ్లను ఎంచుకునే అవకాశమూ ఉంది. ముఖ్యంగా, ఆపిల్ కు ప్రధాన పోటీదారుగా ఉన్న శాంసంగ్ దీనివల్ల ప్రయోజనం పొందవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వివరాలు
భారతదేశంపై 26 శాతం
ఇక ట్రంప్ ఇటీవల ప్రకటించిన సుంకాల గురించి మాట్లాడుకుంటే.. అమెరికాకు దిగుమతయ్యే ప్రతీ వస్తువుపైనా కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 49 శాతం వరకు పన్నులు విధించబడ్డాయి.
భారతదేశంపై 26 శాతం, చైనాపై 34 శాతం, ఐరోపా దేశాలపై 20 శాతం వరకు సుంకాలు విధించబడ్డాయి.