LOADING...
Asteroid: భూమి దగ్గర నుంచి  దూసుకెళ్లిన భారీ గ్రహశకలం.. దాతిరిగి 3 ఏళ్ళ తర్వాత..!
భూమి దగ్గర నుంచి దూసుకెళ్లిన భారీ గ్రహశకలం.. దాతిరిగి 3 ఏళ్ళ తర్వాత..!

Asteroid: భూమి దగ్గర నుంచి  దూసుకెళ్లిన భారీ గ్రహశకలం.. దాతిరిగి 3 ఏళ్ళ తర్వాత..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

భూమికి ఎంతో దగ్గరగా ఒక భారీ గ్రహశకలం దూసుకెళ్లిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 3.16 గంటల సమయంలో '2025 ఎన్‌జే' అనే పేరుగల ఆస్టరాయిడ్ భూమి కక్ష్యకు అత్యంత సమీపంగా ప్రయాణించినట్టు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. దీని వెడల్పు సుమారు 85 అడుగులుగా ఉండగా, గంటకు సుమారు 48,800 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకెళ్లింది. భూమికి సుమారు 22.4 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది వెళ్లిందని నాసా పేర్కొంది. ఈ ఖగోళ వస్తువు పరిమాణ పరంగా ఫుట్‌బాల్ మైదానంతో సమానంగా ఉండడం విశేషం. అయితే ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం లేకపోయినా,దాని వేగం,పరిమాణం కారణంగా ప్రమాదకరమైన ఖగోళ వస్తువుల జాబితాలో చేరింది.

వివరాలు 

ఖగోళ వస్తువులపై నిరంతర నిఘా అవసరం: నాసా 

ఇది అపోలో తరగతిలోకి వచ్చే భూమికి సమీపంలోని గ్రహశకలాల్లో ఒకటి. ఈ గ్రహశకలం సూర్యుని చుట్టూ ఆర్థోగ్రాఫిక్ పథంలో ప్రయాణిస్తూ, ఒక నిర్దిష్ట సమయంలో భూమి సమీపానికి వస్తుంది. దీని మొత్తం కక్ష్య కాలం సుమారు మూడేళ్లు మూడు నెలలు ఉంటుంది. నాసా దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అంతేకాక, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) కూడా దీని కదలికలను గమనిస్తోంది. 2025 ఎన్‌జే గ్రహశకలం మళ్లీ 2028 సెప్టెంబర్ 15న భూమికి మరలా దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది భూమికి సుమారు 22 లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్నప్పటికీ, ఇలాంటి ఖగోళ వస్తువులపై నిరంతర నిఘా అవసరమని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

వివరాలు 

భూమి సమీప కక్ష్యలో తిరిగే గ్రహశకలాల సమూహమే 'అటెన్'

నాసాతో పాటు అనేక అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు భూమికి సమీపంగా కదిలే ఖగోళ వస్తువులను గమనిస్తున్నాయి. వాటి కక్ష్య మార్గం, వేగం, పరిమాణం తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ గ్రహశకలాలు అటెన్ తరగతికి చెందినవిగా గుర్తించబడ్డాయి. ఈ తరగతికి చెందినవి తరచూ భూమి కక్ష్యను దాటి వెళ్తుంటాయి. 'అటెన్' అనేది భూమి సమీప కక్ష్యలో తిరిగే గ్రహశకలాల సమూహానికి కలిపిన పేరు. శాస్త్రవేత్తలు వీటి కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఇవి తిరిగే మార్గంలో కాస్త మార్పు వచ్చినా, భవిష్యత్తులో భూమికి తాకే అవకాశాలు ఉండటంతో వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతోంది.

వివరాలు 

 గ్రహశకలంపై నిర్మాణాన్ని పరిశీలించే మిషన్‌

అందుకే అటువంటి గ్రహశకలాల కదలికలను గమనించడం అత్యవసరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక మరోవైపు, ఇస్రో కూడా ఇలాంటి ఖగోళ వస్తువులను శ్రద్ధగా పరిశీలిస్తోంది. నాసా, ఈసా, జాక్సా (జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ)లతో కలిసి ఇస్రో ఆస్టరాయిడ్ ట్రాకింగ్ వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు సహకరిస్తోంది. అంతేకాదు, భవిష్యత్తులో ఒక గ్రహశకలంపై దిగిపోయి దాని నిర్మాణాన్ని పరిశీలించే మిషన్‌ను కూడా ఇస్రో చేపట్టనుంది.