
మే 5న అరుదైన పెనంబ్రల్ చంద్రగ్రహణం; దీని ప్రత్యేకతల గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
మే 5న ఖగోళంలో అరుదైన చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. పెనంబ్రల్ చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. ఈ ఏడాది ఏర్పడుతున్న రెండో గ్రహణం ఇది. ఏప్రిల్ 20న ఇప్పటికే సూర్య గ్రహణం ఏర్పడింది.
ఈ పెనంబ్రల్ చంద్రగ్రహణం ఈ ఏడాది ఏర్పడుతున్న మొదటి చంద్రగ్రహణం కావడం గమనార్హం. పెనంబ్రల్ చంద్రగ్రహణం భారత్ సహా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, యూరప్, అట్లాంటిక్, ఇండియన్ పసిఫిక్ మహాసముద్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
వాస్తవానికి సూర్యగ్రహణం కంటే చంద్రగ్రహణం ఎక్కువ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రుడు కంటే భూమి చాలా పెద్దది. దీంతో భూమి నీడ చంద్రుడి కంటే చాలా పెద్దది కావడంతో చాలా చోట్ల చంద్రగ్రహణం కన్పిస్తుంది.
చంద్రగ్రహణం
పెనుంబ్రల్ చంద్ర గ్రహణం ఎప్పుడు ప్రారంభమై, ఎప్పుడు ముగుస్తుంది?
పెనుంబ్రల్ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు సాధారణంగా చీకటిలో కలిసిపోతాడు. చంద్రుడు కేవలం భూమి అంబ్రాను కోల్పోతాడు.
పెనుంబ్రల్ గ్రహణం మే 5న రాత్రి 8:44 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 10:52 గంటలకు చంద్రగ్రహణం సంపూర్ణం అవుతుంది.
మే 6న తెల్లవారుజామున 1:01 గంటలకు పెనుంబ్రల్ గ్రహణం ముగుస్తుంది. చంద్రగ్రహణం మొత్తం వ్యవధి నాలుగు గంటల 18 నిమిషాలు.
తదుపరి సూర్యగ్రహణం అక్టోబర్ 14, 2023న సంభవిస్తుంది. అక్టోబర్ 28, 29 తేదీల్లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది.