వేలిముద్ర ఆధారిత ఆధార్ authentication గురించి తెలుసుకుందాం
UIDAI వివిధ రకాల ఆధార్ authentication అందిస్తుంది. వేలిముద్ర ఆధారిత ధృవీకరణ అనేది ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. వివిధ లావాదేవీల కోసం తక్షణమే ఆధార్ హోల్డర్ల గుర్తింపును ధృవీకరించడంలో ఇది సహాయపడుతుంది. వేలిముద్ర ఆధారిత లేదా ఏదైనా ఇతర బయోమెట్రిక్ సంబంధిత సేవను UIDAI దాని అధికారిక కేంద్రాల ద్వారా అందజేస్తుంది. బయోమెట్రిక్, కార్డ్ డేటా UIDAI సెంట్రల్ రిపోజిటరీ ద్వారా ధృవీకరిస్తుంది. ఆధార్ నంబర్, హోల్డర్ బయోమెట్రిక్ (వేలిముద్ర) సమర్పించబడినప్పుడు, అది ధృవీకరణ కోసం UIDAI సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)కి వెళుతుంది. రిపోజిటరీ ఆపై వివరాలను హోల్డర్ గతంలో స్టోర్ చేసిన సమాచారంతో సరిపోల్చడం ద్వారా వాటి ఖచ్చితత్వాన్ని ధృవీకరిస్తుంది.
CIDR ప్రతిరోజూ దాదాపు 70 మిలియన్ల లావాదేవీలను నిర్వహిస్తుంది
వేలిముద్ర ఆధారిత authentication వివిధ లావాదేవీలకు సహాయకరంగా ఉండటమే కాదు అనేక సంక్షేమ పథకాలloలో ఉపయోగపడుతుంది. UIDAI ప్రకారం, డిసెంబర్ 2022 చివరి నాటికి మొత్తం ఆధార్ authentication లావాదేవీల సంఖ్య 88.29 బిలియన్లను దాటింది. CIDR ప్రతిరోజూ దాదాపు 70 మిలియన్ల లావాదేవీలను నిర్వహిస్తుంది, వాటిలో ఎక్కువ భాగం వేలిముద్ర ఆధారితమైనవి. ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఒక నమోదు కేంద్రం వారి జనాభా వివరాలను నమోదు చేస్తుంది. అదనంగా, బయోమెట్రిక్ వివరాలను కూడా తీసుకుని వాటిని ఆధార్ కార్డులో నమోదు చేస్తారు. UIDAIతో స్టోర్ చేసిన ఆధార్ బయోమెట్రిక్ వివరాలను ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వేలిముద్రలతో సహా బయోమెట్రిక్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.