LOADING...
చంద్రయాన్-3:అసైన్‌మెంట్‌లను పూర్తి చేసిన ప్రజ్ఞాన్ రోవర్‌..స్లీప్ మోడ్‌లోకి పంపిన ఇస్రో  
అసైన్‌మెంట్‌లను పూర్తి చేసిన ప్రజ్ఞాన్ రోవర్‌..స్లీప్ మోడ్‌లోకి పంపిన ఇస్రో

చంద్రయాన్-3:అసైన్‌మెంట్‌లను పూర్తి చేసిన ప్రజ్ఞాన్ రోవర్‌..స్లీప్ మోడ్‌లోకి పంపిన ఇస్రో  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2023
11:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

చంద్రునిపై ప్రజ్ఞాన్ రోవర్‌ కు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శనివారం తెలిపింది. జాబిల్లిపై పగలు(14 రోజులు) సమీపిస్తున్న వేళ రోవర్‌ను సురక్షిత ప్రదేశంలో స్లీప్‌ మోడ్‌లోకి పంపాలని స్పేస్ సెంటర్ భావిస్తోంది. రోవర్‌లో ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS), లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) అనే రెండు పేలోడ్‌లు ఉన్నాయి. ల్యాండర్ ద్వారా భూమికి డేటాను ప్రసారం చేసే పేలోడ్‌లు ఆఫ్ చేయబడ్డాయి.

Details 

అన్ని సక్రమంగా జరిగితే.. ప్రజ్ఞాన్‌ రీసెర్చ్ ను కొనసాగిస్తుంది: ఇస్రో 

ప్రజ్ఞాన్‌ రోవర్‌ బ్యాటరీ పూర్తిగా రీఛార్జ్‌ అయి ఉందని తదుపరి సూర్యోదయం కాగానే లైట్ ను గ్రహించడానికి వీలుగా సోలార్ ప్యానెల్ ను సిద్ధంగా ఉంచారు. ఇస్రో అంచనా ప్రకారం సెప్టెంబర్ 22, 2023 న జాబిల్లిపై సూర్యోదయం కావచ్చని X లో పేర్కొంది. అన్ని సక్రమంగా జరిగితే మరికొన్ని రోజుల పాటు ప్రజ్ఞాన్‌ తన రీసెర్చ్ ను ఇంకా కొనసాగించనుంది,లేదంటే మన దేశ ప్రతినిధిగా చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రజ్ఞాన్ రోవర్‌ ను స్లీప్ మోడ్‌లోకి పంపినట్టు ఇస్రో ప్రకటన