గగన్‌యాన్ అబార్ట్ మిషన్-1 ప్రయోగం విజయవంతం
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా తొలి మైలురాయిని అధిగమించింది.
శ్రీహరికోట నుంచి శనివారం టెస్ట్ ఫ్లైట్ అబార్ట్-1 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది.
గగన్‌యాన్ మిషన్‌లో మొదటి అన్‌క్రూడ్ టెస్ట్ ఫ్లైట్ (TV-D1 ఫ్లైట్ టెస్ట్) ప్రయోగం ఇది.
ఉదయం 8:45 గంటలకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని మిషన్ ఇంజిన్ ఇగ్నిషన్‌లో సమస్య వల్ల ఇస్రో వాయిదా వేసింది.
దీంతో వెంటనే లోపాలను గుర్తించి మళ్లీ ప్రయోగాన్ని ఉదయం 10గంటలకు రీషెడ్యూల్ చేసి విజయవంతంగా పరీక్షించింది.
వ్యోమగాముల ఎస్కేప్ సిస్టమ్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఈ ఫ్లైట్ అబార్ట్ పరీక్షను ఇస్రో చేపట్టింది. ఈ ప్రక్రియ అనేది వ్యోమగాములకు అత్యవసర సమయంలో ఉపయోగపడుతుంది.
ఇస్రో
మిషన్ విజయవంతమైనందుకు సంతోషిస్తున్నాము: ఇస్రో చీఫ్
మిషన్ విజయవంతమైందని ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నామని ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు.
ఎస్కేప్ సిస్టమ్ వాహనం సిబ్బందిని, క్రూ మాడ్యూల్‌ను వేరు చేసిందని పేర్కొన్నారు. సముద్రం నుంచి క్రూ మాడ్యూళ్లను వెలికితీసేందుకు తమ సిబ్బంది కృషి చేస్తున్నట్లు సోమనాథ్ తెలిపారు.
TV-D1 ఫ్లైట్ టెస్ట్ మిషన్‌ను మొదట ఉదయం 8గంటలకు లాంచ్ చేయాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాల వల్ల దాన్ని తిరిగి ఉదయం 8.45 గంటలకు సవరించారు.
అయితే ప్రయోగానికి కేవలం 5 సెకన్ల ముందు కౌంట్ డౌన్ ఆగిపోయింది. అ తర్వాత లోపాలను సవరించి తిరిగి ప్రయోగించారు.
భారతదేశం 2024లో గగన్‌యాన్ మిషన్‌ను ప్రయోగించనుంది. ఈ క్రమంలో ముందు కొన్ని ప్రయోగాలను నిర్వహిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెండోసారి విజయవంతం
ISRO launches test flight for Gaganyaan mission after first test flight was aborted pic.twitter.com/54OYUFplFM
— ANI (@ANI) October 21, 2023