Starlink:స్పేస్‌ఎక్స్‌తో జట్టు కట్టినఎయిర్‌టెల్,జియో .. భారత్‌కి ఏం లాభం, ధరలు ఎలా ఉంటాయి..?
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-X తో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇప్పటికే, ఎయిర్ టెల్ కూడా స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది.
భారతదేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి దేశంలోని రెండు ప్రధాన టెలికాం సంస్థలు స్పేస్ ఎక్స్‌తో కలిసి పనిచేయబోతున్నాయి.
దేశవ్యాప్తంగా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు, ప్రజలకు తక్కువ ఖర్చుతో అధిక నాణ్యతతో కూడిన కనెక్టివిటీని అందించేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడనుంది.
వివరాలు
అధిక వేగంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ సేవలు
స్టార్‌లింక్ సేవల ద్వారా ఎయిర్‌టెల్ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఎయిర్‌టెల్ రిటైల్ స్టోర్ల ద్వారా స్టార్‌లింక్ పరికరాలను విక్రయించడం, అలాగే పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, ఇతర ముఖ్యమైన స్థలాలను అధునాతన ఇంటర్నెట్‌తో అనుసంధానించేందుకు ప్రయత్నిస్తోంది.
మరోవైపు, జియో ఈ భాగస్వామ్యాన్ని "అందరికీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందేలా చేసేందుకు కీలకమైన అడుగు"గా అభివర్ణించింది.
జియో బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థతో స్టార్‌లింక్ శాటిలైట్ సేవలను అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా అధిక వేగంతో కూడిన బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొంది.
ఈ ఒప్పందం, ఎఐ ఆధారిత డిజిటల్ యుగంలో హై-స్పీడ్ ఇంటర్నెట్ విశ్వసనీయతను పెంచనుంది.
వివరాలు
స్టార్‌లింక్ భారత్‌కు ఎలా ఉపయోగపడుతుంది?
స్టార్‌లింక్ 2021 నుండి భారత మార్కెట్లో ప్రవేశించే ప్రయత్నాలు చేస్తోంది.
దేశంలో వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడానికి ప్రధాన కారణాలు ఫైబర్ ఆప్టిక్ కేబులింగ్ ఖర్చు, మొబైల్ టవర్ల నిర్మాణం వంటి సాంకేతిక అవరోధాలే.
భారతదేశంలోని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, దట్టమైన అడవులతో కూడిన ప్రాంతాల్లో కూడా 25 Mbps నుండి 220 Mbps వరకు వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించేందుకు స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు ఉపయుక్తంగా మారనున్నాయి.
ప్రస్తుతం దేశంలోని 6,44,131 గ్రామాలలో 6,15,836 గ్రామాలకు 4G కనెక్టివిటీ అందుబాటులో ఉంది.
వివరాలు
భారతదేశంలో స్టార్‌లింక్ ఖర్చు ఎంత ఉంటుంది?
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ సేవలను అందించే దేశాలలో ఒకటిగా ఉంది.
అయితే, స్టార్‌లింక్ ధరల గురించి ఇప్పటి వరకు పూర్తి స్పష్టత లేదు.
2022లో, అప్పటి స్టార్‌లింక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ సంజయ్ భార్గవ పేర్కొన్న ప్రకారం, మొదటి సంవత్సరం ఖర్చు రూ.1,58,000 ఉండొచ్చని, రెండో సంవత్సరానికి ఇది రూ.1,15,000కి తగ్గొచ్చని తెలిపారు.
ప్రస్తుతం భారత పొరుగు దేశాల్లో భూటాన్‌ను మినహాయిస్తే, ఎక్కడా స్టార్‌లింక్ అందుబాటులో లేదు.
భూటాన్‌లో,స్టార్‌లింక్ 'రెసిడెన్షియల్ లైట్ ప్లాన్' నెలకు దాదాపు రూ.3,000 ఖర్చవుతుంది.ఇది 23 Mbps నుండి 100 Mbps వేగం కలిగి ఉంటుంది.
వివరాలు
100కి పైగా దేశాల్లో స్టార్‌లింక్ సేవలు
'స్టాండర్డ్ రెసిడెన్షియల్ ప్లాన్' ధర నెలకు రూ.4,200, దీనివల్ల 25 Mbps నుండి 110 Mbps వరకు ఇంటర్నెట్ వేగం లభిస్తుంది.
ప్రస్తుతానికి, 100కి పైగా దేశాల్లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కెన్యాలో ఇది నెలకు 10 డాలర్లకు లభించగా, యునైటెడ్ స్టేట్స్‌లో 120 డాలర్లుగా ఉంది.
వివరాలు
భారతదేశంలో ఇంటర్నెట్ వృద్ధి
గత పదేళ్లలో భారతదేశంలో ఇంటర్నెట్ విపరీతంగా అభివృద్ధి చెందింది.2014లో దేశంలో దాదాపు 25 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా,2024 నాటికి ఈ సంఖ్య 96 కోట్లకు పెరిగింది.
ఇది 285.53 శాతం వృద్ధిని సూచిస్తుంది. అలాగే, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య 1452 శాతం పెరిగింది.
2014లో వైర్‌లెస్ డేటా వినియోగదారులు నెలకు సగటున 61.66 MB డేటా వాడగా, 2024 నాటికి ఇది 21.30 GBకి పెరిగింది.
ఇది 353 రెట్లు పెరిగినట్లు చూపిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 779 జిల్లాలలో 4.62 లక్షలకు పైగా బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు (BTS) మోహరించబడి ఉన్నాయి.
ఈ కారణంగా, భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G సేవలను అందిస్తున్న దేశాలలో ఒకటిగా మారింది.