Page Loader
Airtel Perplexity Pro: ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఒక సంవత్సరం ఉచిత పర్‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ 
ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఒక సంవత్సరం ఉచిత పర్‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌

Airtel Perplexity Pro: ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఒక సంవత్సరం ఉచిత పర్‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2025
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే సెర్చ్ ఇంజిన్‌, చాట్‌జీపీటీ తరహాలో ఉన్న 'పర్‌ప్లెక్సిటీ' యాప్‌ ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఎయిర్‌ టెల్ ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌, బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లకు 'పర్‌ప్లెక్సిటీ ప్రో (Perplexity Pro)' ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే ఈ సబ్‌స్క్రిప్షన్ సేవలను ఏడాది పాటు ఎటువంటి ఖర్చు లేకుండా ఎయిర్‌టెల్ వినియోగదారులు ఉపయోగించుకునే అవకాశం లభించనుంది. ఈ ఉచిత ఆఫర్‌ను పొందడానికి ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోని రివార్డ్స్ సెక్షన్‌ ద్వారా యూజర్లు రిజిస్టర్ చేసుకోవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. సాధారణంగా ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా నెలకు 20 డాలర్లు అంటే సుమారు రూ.1730 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తోంది.

వివరాలు 

ఎయిర్‌టెల్‌తో జట్టు కట్టి మరింత విస్తృత స్థాయిలో సేవలు 

అయితే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో మరింతగా సేవలను విస్తరించేందుకు వినియోగదారులను ఆకట్టుకునే ఉచిత ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇప్పటికే పేటియం భాగస్వామ్యంతో భారతీయ విద్యార్థులకు 'పర్‌ప్లెక్సిటీ ప్రో' సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎయిర్‌టెల్‌తో జట్టు కట్టి మరింత విస్తృత స్థాయిలో సేవలను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పర్‌ప్లెక్సిటీ సహ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో మరిన్ని వర్గాల ప్రజలకు ఏఐ ఆధారిత బ్రౌజర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులతో పాటు వృత్తి నిపుణులు, గృహిణులు వంటి వారు కూడా ఈ సేవలను ఉపయోగించుకొని లబ్ధి పొందవచ్చు'' అని తెలిపారు.

వివరాలు 

యూజర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు కొత్త ఆఫర్లు 

దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న సంప్రదాయ వెబ్ బ్రౌజర్లు ప్రస్తుతం కృత్రిమ మేధ సాంకేతికతను కలుపుకొని కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయని, ఈ నేపథ్యంలో ఏఐ బ్రౌజర్ల మధ్య పోటీ కూడా ఎక్కువైందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనితో యూజర్లను ఆకట్టుకునేందుకు కంపెనీలు కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయని చెప్పారు.