Page Loader
Airtel: వాట్సాప్,ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లలో ఆర్థిక సందేశాలను నిషేధించండి ..  RBI ని కోరిన ఎయిర్‌టెల్  
డిజిటల్‌ మోసాలపై కలిసికట్టుగా పోరాడదాం.. RBIని కోరిన ఎయిర్‌టెల్

Airtel: వాట్సాప్,ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లలో ఆర్థిక సందేశాలను నిషేధించండి ..  RBI ని కోరిన ఎయిర్‌టెల్  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్ మోసాలను ఎదుర్కొనేందుకు ఐక్యంగా పోరాడాలని టెలికాం దిగ్గజం ఎయిర్‌ టెల్‌ పిలుపునిచ్చింది. దాదాపు 40కి పైగా బ్యాంకులు,భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌ బి ఐ),నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తో కలిసి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొంది. ఇప్పటికే వెలుగులోకి వచ్చిన మోసాలకు సంబంధించిన ఆర్థిక డొమైన్‌లను ఒక రిపాజిటరీ రూపంలో రూపొందించి,నకిలీ వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయడంతో పాటు,డిజిటల్‌ మోసాలను విభిన్న దశలలో ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడుతుందని ఎయిర్‌టెల్‌ అభిప్రాయపడింది. ఎస్‌బీఐ,హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రముఖ బ్యాంకులతో సహా ఇతర ప్రధాన బ్యాంకులను కూడా ఈ ప్రతిపాదనపై సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.

వివరాలు 

ఎయిర్‌టెల్‌-ఎన్‌పీసీఐ మధ్య భాగస్వామ్యం

మోసాలకు పాల్పడుతున్న ఆర్థిక డొమైన్‌ల వివరాలను పంచుకోవడానికి సంయుక్త రిపాజిటరీ ఏర్పాటు చేయాలన్న సూచనను ఎయిర్‌టెల్‌ ఆర్‌బీఐకి కూడా పంపించింది. నియంత్రణ పరంగా చర్చలు జరిపేందుకు కూడా సంస్థ సన్నద్ధంగా ఉందని తెలిపింది. వినియోగదారుల భద్రతను పెంచే విధంగా ఒక సమగ్ర నియమావళిని రూపొందించడంలో భాగస్వామ్యంగా ఉంటామని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. డిజిటల్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందని కూడా సూచించింది. భారత్‌లో డిజిటల్‌ లావాదేవీల వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఎయిర్‌టెల్‌-ఎన్‌పీసీఐ మధ్య భాగస్వామ్యం కీలకమని సంస్థ స్పష్టంచేసింది.