Loading...
Anthropic AI Office Tools: గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌కు ఆంథ్రోపిక్‌ షాక్‌.. AI ఆఫీస్‌ టూల్స్‌ లాంచ్
గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌కు ఆంథ్రోపిక్‌ షాక్‌.. AI ఆఫీస్‌ టూల్స్‌ లాంచ్

Anthropic AI Office Tools: గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌కు ఆంథ్రోపిక్‌ షాక్‌.. AI ఆఫీస్‌ టూల్స్‌ లాంచ్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 11, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫీస్‌లో రోజూ చేసే పనులనే AIతో మరింత సులభంగా చేయాలనే లక్ష్యంతో ఆంథ్రోపిక్‌ కీలక అడుగు వేసింది. తన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌ క్లాడ్‌లో Claude Whiteboards, Claude Sheets పేరుతో రెండు కొత్త టూల్స్‌ను తీసుకొచ్చింది. గతంలో Claude Dashboardsగా ఉన్న డేటా అనలిటిక్స్‌ సేవను Claude Dataగా మార్చింది. వీడియో కాల్‌ అసిస్టెంట్‌, డేటా విశ్లేషణ, స్ప్రెడ్‌షీట్‌ తయారీ వంటి ఫీచర్లను ఒకే ఎకోసిస్టమ్‌లోకి తీసుకురావడంతో.. క్లాడ్‌ను సాధారణ AI చాట్‌బాట్‌ స్థాయి నుంచి పూర్తి స్థాయి వర్క్‌ప్లేస్‌ టూల్‌గా మార్చే ప్రయత్నం కనిపిస్తోంది.

Details

ఆలోచనల నుంచి ప్రాజెక్ట్‌ ప్లాన్‌ వరకు

టీమ్‌ సభ్యులు కలిసి కొత్త ఐడియాపై చర్చిస్తున్నప్పుడు వాటిని క్రమబద్ధీకరించడం కొన్నిసార్లు పెద్ద పనిగా మారుతుంది.

ఈ సమస్యకు Claude Whiteboards పరిష్కారం చూపనుంది. యూజర్‌ తన ఆలోచనను సాధారణ భాషలో చెబితే.. క్లాడ్‌ దాన్ని టైమ్‌లైన్లు, బాధ్యతలు, పనులతో కూడిన డిజిటల్‌ బోర్డుగా మార్చుతుంది.

తర్వాత ఆ బోర్డును డాక్యుమెంట్‌ లేదా ప్రజెంటేషన్‌గా కూడా మార్చుకోవచ్చు.

Details

Excel, Google Sheetsకు AI పోటీ

Claude Sheets మాత్రం మైక్రోసాఫ్ట్‌ ఎక్సెల్‌, గూగుల్‌ షీట్స్‌ను పోలి పనిచేస్తుంది. కానీ ఇందులో AI నేరుగా అందుబాటులో ఉంటుంది.

ఉదాహరణకు ఉద్యోగుల హైరింగ్‌ బడ్జెట్‌ లేదా మార్కెటింగ్‌ క్యాంపెయిన్‌ ట్రాకర్‌ కావాలని క్లాడ్‌కు చెప్పగానే.. అవసరమైన ట్యాబ్స్‌, ఫార్ములాలు, ఫార్మాటింగ్‌, డ్రాప్‌డౌన్‌ మెనూలతో స్ప్రెడ్‌షీట్‌ను సిద్ధం చేస్తుంది.

సెల్స్‌లో నేరుగా మార్పులు చేయడంతో పాటు ఏం మార్చిందో కూడా చూపిస్తుంది.

ADVERTISEMENT

Details

కంపెనీ డేటాను అర్థం చేసుకునే Claude Data

ఇక గతంలో Claude Dashboardsగా ఉన్న సేవకు కొత్త రూపమే Claude Data. Amazon Redshift, BigQuery, ClickHouse వంటి ప్లాట్‌ఫామ్‌లకు అనుసంధానమైన కంపెనీ డేటాపై ప్రశ్నలు అడిగి విశ్లేషణ పొందొచ్చు.

Certified Queries, Live Sharing, Data Storytelling వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

ముఖ్యంగా ఒకే మెట్రిక్‌కు వేర్వేరు టీమ్‌లు వేర్వేరు నిర్వచనాలు ఉపయోగించకుండా.. డేటా టీమ్‌లు వాటిని ధ్రువీకరించుకునే సదుపాయం ఇందులో ఉంది.

ADVERTISEMENT

Details

ఆఫీస్‌ పనుల్లో AI మరింత దగ్గరగా..

వీడియో కాల్స్‌ నుంచి బ్రెయిన్‌స్టార్మింగ్‌, స్ప్రెడ్‌షీట్లు, డేటా విశ్లేషణ వరకు రోజువారీ ఆఫీస్‌ పనుల్లో AIని నేరుగా భాగం చేయడమే ఆంత్రోపిక్‌ తాజా ప్రయత్నం.

గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే తమ ఆఫీస్‌ ఉత్పాదకత సాధనాల్లో AIని విస్తరిస్తున్న నేపథ్యంలో.. క్లాడ్‌ కూడా అదే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

దీంతో భవిష్యత్తులో ఒక ఉద్యోగి చేసే సాధారణ ఆఫీస్‌ పనుల్లో ఎంతవరకు AI భాగస్వామిగా మారుతుందనే ఆసక్తి మరింత పెరుగుతోంది.

ADVERTISEMENT