
ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ గ్రాండ్ లాంఛ్.. నాలుగు మోడళ్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆపిల్ వండర్ లస్ట్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆపిల్ మొబైల్ ఫోన్ ప్రేమికుల కోసం ఆ సంస్థ సీఈఓ టీమ్ కుక్ అద్భుతమైన ఫీచర్లతో అప్ డేటెడ్ మోడళ్లను ప్రకటించారు.
ఈ క్రమంలోనే మొత్తం ఆరు ఆపిల్ ఉత్పత్తులను ఆవిష్కరించారు.
1. ఆపిల్ వాచ్ సిరీస్ 9
2. ఆపిల్ వాచ్ అల్ట్రా 2
3. ఐఫోన్ 15
4. ఐఫోన్ 15 ప్లస్
5. ఐఫోన్ 15 ప్రో
6. ఐ ఫోన్ 15 ప్రో మ్యాక్స్ వీటిలో ఐఫోన్ 15 సిరీస్ కి సంబంధించిన ధరలను, వాటి అత్యాధునికమైన ఫీచర్లను కంపెనీ వెల్లడించింది.
DETAILS
ఐఫోన్ 15 సిరీస్ ధరలు ఎంతో తెలుసుకోండి
ఐఫోన్ 15 ప్రో ధర 999 డాలర్లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,800 నుంచి ప్రారంభమవుతుంది.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధరను 1199 డాలర్లుగా ప్రకటించారు. భారత కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.99,300 నుంచి కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్టోరేజ్ 256 జీబీ నుంచి మొదలుకానుంది.
ఐఫోన్ 15, 15 PLUS ధరలు తెలుసుకోండి :
ఐఫోన్ 15 ధర 799 డాలర్లుగా నిర్ణయించారు - భారత కరెన్సీలో దాదాపుగా రూ.66,200 నుంచి ప్రారంభమవుతోంది.
ఐఫోన్ 15 ప్లస్‌ను 899 డాలర్లు- భారత కరెన్సీ ప్రకారం రూ.74,500 నుంచి కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.
DETAILS
48 మెగా పిక్సెల్ తో పవర్ ఫుల్ కెమెరా సిద్ధం
టెలిఫొటో కెమెరా :
ఐఫోన్ 15 ప్రోలో 48 మెగాపిక్సెల్ కెమెరాను ప్రధాన సెన్సార్‌గా రూపొందించారు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ 3x టెలిఫొటో కెమెరాను ప్రవేశపెట్టారు.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లోనూ 48 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 5x జూమ్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు. 12 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా సైతం సిద్ధం చేశారు.
పవర్‌ఫుల్ ప్రాసెసర్ :
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ల్లో యాపిల్ బయోనిక్ పవర్డ్ A-17 ప్రో ప్రాసెసర్‌ను రెఢీ చేశారు. యాపిల్ ఇంతవరకు రూపొందించిన పవర్‌ఫుల్ ప్రాసెసర్ ఇదే కావడం విశేషం.
DETAILS
టైప్ సీ పోర్ట్ ఉపయోగించడం ఇదే ఫస్ట్ టైమ్
మ్యూట్ బటన్ ను తొలగించిన కంపెనీ యాపిల్ ఫోన్లలో కనిపించే మ్యూట్ బటన్‌ను తీసేసిన కంపెనీ, యాక్షన్ బటన్ ను ప్రవశపెట్టింది.ఫలితంగా ఎన్నో ఉపయోగాలను సిద్ధం చేసింది.
వాయిస్ రికార్డింగ్‌ను ఈ బటన్‌తో చేసుకోవచ్చని కంపెనీ చెప్పింది. ఐ ఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లేని సిద్ధం చేశారు.
15లో 48 మెగాపిక్సెల్ కెమెరాలు ఐఫోన్ 15 సిరీస్‌లో 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. ఇందులో 2x టెలిఫొటో జూమ్ కూడా అందుబాటులో ఉంది.
ఐఫోన్ 15లో USB టైప్-సీ పోర్టు, టైప్-సీ పోర్టుతో ఐఫోన్ లాంచ్ అవడం ఇదే తొలిసారి. ై