LOADING...
Iphone 16e: భారత్‌లో ఐఫోన్‌ 16ఈని విడుదల చేసిన టెక్‌ దిగ్గజం ఆపిల్.. ధర, ఫీచర్లు ఇవే..
భారత్‌లో ఐఫోన్‌ 16ఈని విడుదల చేసిన టెక్‌ దిగ్గజం ఆపిల్.. ధర, ఫీచర్లు ఇవే..

Iphone 16e: భారత్‌లో ఐఫోన్‌ 16ఈని విడుదల చేసిన టెక్‌ దిగ్గజం ఆపిల్.. ధర, ఫీచర్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌ సంస్థ తన తాజా స్మార్ట్‌ ఫోన్‌ మోడల్‌ ఐఫోన్‌ 16ఈ (iPhone 16e)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీనితో పాటు, తన అధికారిక స్టోర్‌ నుంచి ఐఫోన్‌ ఎస్‌ఈను తొలగించింది. మొదట ఐఫోన్‌ ఎస్‌ఈ 4ను ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, కంపెనీ ఐఫోన్‌ 16 సిరీస్‌ను విస్తరించేందుకు ఈ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరింత మంది వినియోగదారులకు చేరువయ్యే లక్ష్యంతో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫోన్‌గా దీన్ని రూపొందించింది.

వివరాలు 

 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు తోడు, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌  సదుపాయం 

ఫీచర్ల విషయానికి వస్తే,ఐఫోన్‌ 16ఈలో 6.1 అంగుళాల OLED స్క్రీన్‌ను అందించారు,ఇది 60Hz రిఫ్రెష్‌ రేట్‌తో పనిచేస్తుంది. 800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది.ఈ మోడల్‌లో యాక్షన్‌ బటన్‌ కూడా అందించారు. ప్రాసెసింగ్ కోసం అధునాతన A18 చిప్‌ను ఉపయోగించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్లు సపోర్ట్‌ చేయనుండగా,ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 48MP ప్రధాన కెమెరా, ముందువైపు 12MP సెల్ఫీ కెమెరా అందించారు. బ్యాటరీ విషయానికి వస్తే, 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు తోడు, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సదుపాయాన్ని కూడా కలిగి ఉంది. ఇంకా, శాటిలైట్‌ కనెక్టివిటీ ఫీచర్లు, ఫేస్‌ రికగ్నైషన్‌, iOS 18 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, USB టైప్‌-C పోర్ట్‌ వంటి ఆధునిక ఫీచర్లతో వస్తుంది.

వివరాలు 

ఫిబ్రవరి 28 నుంచి అధికారికంగా విక్రయాలు

ధర విషయానికి వస్తే, ఈ కొత్త మోడల్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 128GB ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌ రూ. 59,900కి, 256GB వేరియంట్‌ రూ. 69,900కి, 512GB వేరియంట్‌ రూ. 89,900కి లభ్యం కానున్నాయి. ఈ ఫోన్‌ నలుపు, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉండగా, ఫిబ్రవరి 21 నుంచి ముందస్తు ఆర్డర్లు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 28 నుంచి అధికారికంగా విక్రయాలు ప్రారంభంకానున్నాయి.