Page Loader
బగ్ సమస్యలకు సరికొత్త పరిష్కారాలతో ఆపిల్ iOS 16.3 అప్డేట్ విడుదల
ఐఫోన్ 14 Pro లో డిస్‌ప్లే సమస్య కూడా పరిష్కారమైంది

బగ్ సమస్యలకు సరికొత్త పరిష్కారాలతో ఆపిల్ iOS 16.3 అప్డేట్ విడుదల

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 24, 2023
03:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ ఎట్టకేలకు iOS 16.3 అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఇది ఐఫోన్ ల భద్రతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. ఫిజికల్ కీని ఉపయోగించి ఆపిల్ IDని రక్షించుకునే సామర్థ్యాన్ని ఈ అప్‌డేట్ అందిస్తుంది. ఇది iCloud అకౌంట్ల కోసం కంపెనీ అందించే అధునాతన డేటా రక్షణ కూడా అందిస్తుంది. రెండవ తరం Homepodకు సపోర్ట్ చేస్తుంది, ఐఫోన్ 14 Pro డిస్‌ప్లే సమస్యను కూడా పరిష్కరిస్తుంది. iOS 16.3 అప్‌డేట్ iCloud అకౌంట్ ను లాక్ చేయడానికి ఆపిల్ ID సెక్యూరిటీ కీని (YubiKey లాంటిది) ఉపయోగించగల సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆపిల్ iOS 16.3 అప్డేట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ని ఉపయోగించి iCloud డేటాను రక్షిస్తుంది.

ఐఫోన్

ఈ అప్డేట్ లో ఐఫోన్ 14 Pro డిస్ప్లే సమస్య కూడా పరిష్కరించింది

YubiKey అనేది కంప్యూటర్‌లు, నెట్‌వర్క్‌లు లేదా ఆన్‌లైన్ సేవలను రక్షించే Authenticaterగా పనిచేసే హార్డ్‌వేర్ సాధనం. దానికోసం అకౌంట్ తో YubiKeyని నమోదు చేసుకోవాలి. లాగిన్ చేసిన ప్రతిసారీ, Authentication ప్రక్రియలో భాగంగా ఫోన్ కి కీని లింక్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది. పూర్తయిన తర్వాత, పూర్తి అకౌంట్ యాక్సెస్‌ని పొందడానికి YubiKeyలో బటన్‌ను నొక్కండి. అదనంగా, ఈ అప్‌డేట్ ఐఫోన్ 14 Pro లో డిస్‌ప్లే సమస్యను కూడా పరిష్కరించింది. లాక్ స్క్రీన్‌పై వాల్‌పేపర్ నల్లగా కనిపించే సమస్య కూడా పరిష్కారమైంది. iOS 16.3 అప్‌డేట్ ప్రస్తుతం దశలవారీగా విడుదల చేయబడుతోంది. ఈ అప్డేట్ కోసం Settings > General > Software Update లోకి వెళ్ళి చూడాలి.