చౌకైన ఎయిర్‌పాడ్స్ AirPods Lite లాంచ్ చేసే ఆలోచనలో ఆపిల్
ఆపిల్ చౌకైన ఎయిర్‌పాడ్స్ ఇయర్‌బడ్‌లపై పనిచేస్తోంది, వాటినే "AirPods Lite" అంటారు. AirPods డిమాండ్ 2022లో 73 మిలియన్ యూనిట్ల నుండి 2023లో 63 మిలియన్లకు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది కస్టమర్‌లను ఆకర్షించడానికి కంపెనీ సరసమైన ఇయర్‌బడ్‌లపై పని చేస్తోందని విశ్లేషకులు సృష్టం చేసారు. ఆపిల్ ప్రస్తుతం భారతదేశంతో పాటు, ఇతర ప్రపంచ మార్కెట్లలో నాలుగు వేర్వేరు AirPods వెర్షన్‌లను అమ్ముతుంది. అత్యంత సరసమైన వాటిలో AirPods 2nd-Gen రూ. 14,900, తర్వాత AirPods 3rd-Gen రూ. 19,900, AirPods Pro 2nd-Gen రూ. 26,900. అత్యంత ఖరీదైన Apple AirPods Max ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ ధర Rs 59,900.
ఆపిల్ Airpods ధర ఎక్కువ ఉన్నా వాటిలో కొన్ని ఫీచర్లు అందుబాటులో లేవు
ఇప్పుడు ఆపిల్ ఈ AirPods Lite దాదాపు రూ. 10,000 వద్ద లాంచ్ చేయగలిగితే, చాలా మంది ఐఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తుంది. ధర ఎక్కువున్నప్పటికీ ఆపిల్ AirPods 2nd-Genలో డైనమిక్ హెడ్ ట్రాకింగ్‌తో కూడిన స్పేషియల్ ఆడియో, వాటర్-రెసిస్టెంట్ ఛార్జింగ్ కేస్, హై డైనమిక్ రేంజ్ యాంప్లిఫైయర్ వంటి ఫీచర్లు లేవు. అత్యంత ఖరీదైన AirPods 3rd-Genలో ANC (యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్) లేదు, ఇది అంతకంటే తక్కువ ధరలో వస్తున్న ఇయర్‌బడ్‌ల ఫీచర్స్ లో ఉంది. దీని మోడల్ 2వ-జనరేషన్ మోడల్ లాగా ఉండచ్చు. ఛార్జింగ్ కేస్‌లో లైటింగ్ పోర్ట్ లేదా యూనివర్సల్ టైప్-సి పోర్ట్ ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.