LOADING...
Kamala Harris: కమలా హారిస్‌ వార్నింగ్ వైరల్.. వైర్లెస్‌ ఇయర్‌ఫోన్లు వాడొద్దు… 
కమలా హారిస్‌ వార్నింగ్ వైరల్.. వైర్లెస్‌ ఇయర్‌ఫోన్లు వాడొద్దు…

Kamala Harris: కమలా హారిస్‌ వార్నింగ్ వైరల్.. వైర్లెస్‌ ఇయర్‌ఫోన్లు వాడొద్దు… 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తాజాగా వైర్లెస్‌ ఇయర్‌ఫోన్లపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో కలకలం రేపుతున్నాయి. ప్రముఖ హాస్యనటుడు స్టీఫెన్‌ కొల్బెర్ట్‌ హోస్ట్ చేసే లేట్నైట్‌ టాక్‌ షోలో పాల్గొన్న కమలా, తన కొత్త పుస్తకం 107 డేస్లోని కొన్ని ఇప్పటివరకు బయటపడని ఫోటోలు చూపించారు. అందులో ఒక ఫోటోను వివరించుతూ, జో బైడెన్‌ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన తర్వాత, ఆమెకు వచ్చిన ఎన్నో ఫోన్లు తాను వాయర్డ్‌ ఇయర్‌ఫోన్లతోనే మాట్లాడానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె వైర్లెస్‌ ఇయర్‌ఫోన్లు ఎందుకు వాడరన్న దానిపై ఆవిడ చెప్పిన కారణం నెట్టింట్లో వైరల్‌ అయ్యింది.

వివరాలు 

వైరలెస్‌ ఇయర్‌పాడ్స్‌తో మన సంభాషనలు ఏజెన్సీలు వినగలవా?

"నేను సెనేట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేశాను. క్లోజ్డ్‌ డోర్‌ బ్రీఫింగ్స్‌లో పాల్గొన్నాను. అందుకే చెబుతున్నా... ట్రైన్‌లో ఇయర్‌పాడ్స్‌ పెట్టుకుని మాట్లాడుతున్నామంటే ఎవరూ వినలేరనుకుంటే పొరపాటే. వైర్డ్‌ ఇయర్‌ఫోన్లు కొంచెం సేఫ్‌గా ఉంటాయి," అని ఆమె హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌ కావడంతో, అనేక మంది వాడుకదారులు "వైరలెస్‌ ఇయర్‌పాడ్స్‌తో మన సంభాషనలు ఏజెన్సీలు వినగలవా?" అనే ఆందోళనలో పడ్డారు. "ఒక రాజకీయ నాయకురాలు మీను గమనిస్తున్నారంటూ హెచ్చరిస్తే... ఇక అంతే సంగతులు!" అని ఓ యూజర్‌ కామెంట్‌ చేస్తే, మరొకరు "ఇది నిజంగా మంచి హెచ్చరికే. ఎవరి దగ్గరైనా ఎయిర్‌పాడ్స్‌ ఉంటే, వాళ్ల సంభాషనలన్నీ వినగలుగుతారు," అని రాశారు.

వివరాలు 

ముఖ్యమైన కాల్స్‌కు వైర్డ్‌ ఫోన్లే మేటి

మరో వ్యక్తి అభిప్రాయపడుతూ, "పాటలు వింటున్నా, సాధారణ కాల్స్ చేస్తున్నా వైర్లెస్‌ సరిపోతుంది. కానీ సెన్సిటివ్‌ డేటా, ముఖ్యమైన కాల్స్‌కు వైర్డ్‌ ఫోన్లే మేటి. కమలా తప్పు చెప్పలేదు," అన్నారు. ఇంకో వ్యక్తి హాస్యంగా స్పందిస్తూ, "గవర్నమెంట్‌ నన్ను ఎయిర్‌పాడ్స్‌ ద్వారా వింటుంటే.. నేను వారం రోజులుగా ఒకే పాట రిపీట్‌లో వింటున్నానన్న విషయం తెలిసిపోతుంది," అన్నారు. ఇదే ఇంటర్వ్యూలో కమలా హారిస్‌ తన 2026లో కాలిఫోర్నియా గవర్నర్‌ రేసులో పోటీ చేయకూడదని తీసుకున్న నిర్ణయం వెనుక నిజానిజాలు తెలిపారు. ప్రస్తుతం రాజకీయ పదవుల నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నానని, వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆమె అభిప్రాయపడింది.

వివరాలు 

ఈ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది

"ఇది నా కెరీర్‌ అయినా కూడా... ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది - ఈ వ్యవస్థలో మళ్లీకి వెళ్లాలనిపించడం లేదు. ఈ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది," అని హారిస్‌ చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వారే తాము పడిన బాధల్ని అర్థం చేసుకోకుండా, అప్పగించాల్సిన బాధ్యతలను చాలా సులువుగా వదులుకుంటారనేది తాను ఊహించలేదని, అలాంటి సర్ధుబాటు చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైర్లెస్‌ ఇయర్‌ఫోన్ల పై కమలా హారిస్