
2025 PN7: సరికొత్త క్వాసి-మూన్‌ను కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు : '2025 పీఎన్7
ఈ వార్తాకథనం ఏంటి
భూమికి సమీపంలో శాస్త్రవేత్తలు ఒక చిన్న చందమామను గుర్తించారు.నిజానికి ఇది ఒక గ్రహశకలం (Asteroid)కాగా,దీనికి '2025 పీఎన్7' అనే పేరు నిర్దేశించారు. ఇది సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది,కానీ భూమికి ఎంతో దగ్గరగా ప్రయాణిస్తుంది. ఈఅంతరిక్ష శిలకు కూడా సూర్యుడిని చుట్టి ఒక పూర్తి చక్రం పూర్తి చేయడానికి ఏడాది సమయం అవసరం అవుతుంది. ఈ రకమైన గ్రహశకలాలను "క్వాసీ మూన్"(Quasi-Moon)అంటారు.ఇవి భూమి చుట్టూ తాత్కాలికంగా తిరిగే మినీ మూన్‌ల నుండి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. '2024 పీటీ5' అనే మినీ మూన్ దీనికి ఉదాహరణ. అది గత ఏడాది కేవలం రెండు నెలల పాటు భూమి చుట్టూ తిరిగింది. శాస్త్రవేత్తలు ఈ కొత్త గ్రహశకలాన్ని చందమామ నుంచి విడిపోయిన తునకగా భావిస్తున్నారు.
వివరాలు
మరో 60 ఏళ్ల పాటు పుడమికి సమీపంలో..
ప్రస్తుతం భూమికి సమీపంలో అనేక క్వాసీ చందమామలు ఉన్నట్లు గుర్తించబడ్డాయి. 2025 పీఎన్7ను గత నెల 29న హవాయ్‌లోని పాన్-స్టార్స్ అబ్జర్వేటరీ ద్వారా గుర్తించారు. గత దశాబ్దాల డేటాను విశ్లేషించినప్పుడు, ఇది భూమి సమీప కక్ష్యలో పెద్ద కాలంగా పరిభ్రమిస్తున్నది అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చాలా చిన్నదిగా, మసకమసకగా ఉండటం వల్ల ఇంతకాలం వరకు ఖగోళ శాస్త్రవేత్తల దృష్టికి పట్టకుండా ఉండి ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రహశకలం భూమికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు కూడా దూరం మూడు లక్షల కిలోమీటర్ల మేర మాత్రమే ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఇంకా, ఇది వచ్చే 60 ఏళ్ల పాటు భూమి సమీపంలో ఉండి పరిభ్రమిస్తూనే ఉంటుందని తెలియజేశారు.