
Baal Aadhaar Card: మీ పిల్లల కనీస వయస్సు,ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏయే డాక్యుమెంట్లు అవసరం? ఫుల్ ప్రాసెస్ ఇదిగో..!
ఈ వార్తాకథనం ఏంటి
మీ పిల్లలకు బాల్ ఆధార్ కార్డ్ తీసుకున్నారా? తీసుకోనట్లయితే వెంటనే తీసుకోవడం మంచిది. ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు బాల్ ఆధార్ కార్డ్ తీసుకోవచ్చు.వాస్తవానికి బాల్ ఆధార్ నంబర్ ఒక్కసారి మాత్రమే ఇస్తారు. అయితే, దీనిలో బయోమెట్రిక్స్ ఉండవు. కేవలం ఫొటో, ఇతర వివరాలు మాత్రమే ఉంటాయి. పిల్లల స్కూల్ అడ్మిషన్లు, ఆరోగ్య సేవలు, పెట్టుబడి పథకాలకు బాల్ ఆధార్ అవసరం. భారత ప్రభుత్వం ఐదు సంవత్సరాల లోపు పిల్లల కోసం బాల్ ఆధార్ కార్డ్ జారీ చేస్తుంది. ఇది తల్లి లేదా తండ్రి ఆధార్‌తో లింక్ చేసిన ప్రత్యేక 12 అంకెల గుర్తింపు నంబరుగా ఉంటుంది. బాల్ ఆధార్‌ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.
వివరాలు
బాల్ ఆధార్ అంటే ఏమిటి?
బాల్ ఆధార్ కార్డు అనేది ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు జారీ చేసే ప్రత్యేక ఆధార్ కార్డు. ఈవయస్సు పిల్లల బయోమెట్రిక్ సమాచారం (ఫింగర్ ప్రింట్లు,కంటి ఐరిస్ స్కాన్) తీసుకోరు. ఎందుకంటే ఆవయస్సులో ఆసమాచారం స్థిరంగా ఉండదు.పిల్లల ఫోటో,పేరు,పుట్టిన తేదీ, తల్లిదండ్రుల వివరాలను మాత్రమే నమోదు చేస్తారు. బాల్ ఆధార్ నంబర్ ఒకే ఒక్కటి. అది జీవితాంతం మారదు. బాల్ ఆధార్ కార్డు ఎక్కడ తీసుకోవచ్చు? ఆధీకృత ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించడం ద్వారా బాల్ ఆధార్ కార్డు పొందవచ్చు. కొంతమంది ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పుట్టిన వెంటనే ఆధార్ నమోదు చేసే అవకాశాన్ని ఉపయోగించవచ్చు.జనన ధృవీకరణ పత్రం ఆధారంగా,తల్లి లేదా తండ్రి ఆధార్‌తో కలిపి నమోదు చేయించుకోవచ్చు.
వివరాలు
అవసరమైన డాక్యుమెంట్లు:
ఆసుపత్రి లేదా మున్సిపాలిటీ జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ కోసం తల్లి లేదా తండ్రి మొబైల్ నంబర్ దరఖాస్తు ప్రక్రియ: పిల్లలతో సమీప ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. నమోదు ఫారంలో పిల్లల వివరాలు నమోదు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్ల ఫోటోకాపీలను జత చేయాలి. పిల్లల లైవ్ ఫోటోను అక్కడే తీసుకుంటారు. నమోదు నెంబరుతో కూడిన రసీదు ఇస్తారు. ఆన్‌లైన్ ద్వారా ఆధార్ స్థితిని చెక్ చేసుకోవచ్చు.
వివరాలు
బాల్ ఆధార్ ఎప్పుడు వస్తుంది?
రిజిస్ట్రేషన్ తర్వాత 60 నుంచి 90 రోజుల్లో బాల్ ఆధార్ కార్డు రిజిస్టర్డ్ అడ్రస్‌కు పోస్ట్ ద్వారా వస్తుంది. ఆధార్ నంబర్ సమాచారం మీ మొబైల్ నంబర్‌కు కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. అవసరమైతే UIDAI వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బాల్ ఆధార్ రుసుము ఎంత? : బాల్ ఆధార్ పూర్తిగా ఉచితం. నమోదు ప్రక్రియలో ఎలాంటి రుసుము వసూలు చేయరు. ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత పిల్లల బయోమెట్రిక్ వివరాలను (ఫింగర్ ప్రింట్లు, కంటి స్కాన్) నవీకరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా పూర్తిగా ఉచితమే.