Page Loader
BSNL Live TV: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ యూజర్లకు 500 లైవ్‌టీవీ ఛానల్స్ 
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ యూజర్లకు 500 లైవ్‌టీవీ ఛానల్స్

BSNL Live TV: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ యూజర్లకు 500 లైవ్‌టీవీ ఛానల్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) కొత్త సేవలను ప్రారంభించింది. ఫైబర్‌ వినియోగదారుల కోసం ఐఎఫ్‌టీవీ (IFTV) పేరిట ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ టు హోమ్‌ (FTTH) వినియోగదారులకు మాత్రమే ఈ సేవలు లభిస్తాయని సంస్థ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇప్పటికే జియో,భారతీ ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలు ఫైబర్‌ యూజర్లకు లైవ్‌ టీవీ ఛానళ్లను అందిస్తున్నాయి. అయితే,ఈ సేవలు వినియోగించినప్పుడు డేటా వినియోగం నెలవారీ పరిమితిలోనుంచి మినహాయిస్తున్నాయి.

వివరాలు 

డేటా ఖర్చు లేకుండా హై స్ట్రీమింగ్‌ క్వాలిటీ

బీఎస్ఎన్‌ఎల్‌ ఐఎఫ్‌టీవీ సేవలు మాత్రం డేటా ఖర్చు లేకుండా హై స్ట్రీమింగ్‌ క్వాలిటీతో లభిస్తాయి. అదనపు చార్జీలు లేకుండా ఈ టీవీ ఛానళ్లను చూడొచ్చని BSNL పేర్కొంది. ప్రస్తుతం ఈ సేవలు ఆండ్రాయిడ్‌ టీవీలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 10 లేదా పై వెర్షన్లలో ఉన్న వినియోగదారులు బీఎస్ఎన్‌ఎల్‌ లైవ్‌టీవీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని వీక్షించవచ్చు. ఇతర రాష్ట్రాల్లో ఈ సేవలు త్వరలో ప్రారంభం కానున్నట్లు సంస్థ వెల్లడించింది. ఫైబర్‌ వినియోగదారులకు అపరిమిత డేటా అందిస్తున్న BSNL, త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌తో పాటు గేమింగ్‌ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలో ఉంది.