Page Loader
Chandrayaan 3 mission successful: సాహో ఇస్రో.. జయహో భారత్.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం
చంద్రయాన్‌-3 ప్రయోగం ఘన విజయం

Chandrayaan 3 mission successful: సాహో ఇస్రో.. జయహో భారత్.. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 23, 2023
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

చందమామపై రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై చంద్రయాన్ మిషన్ రోవర్‌ కాలుమోపుతూ భారతదేశానికి, ఇస్రోకు వెలకట్టలేని ప్రతిష్ఠను తెచ్చిపెట్టింది. దాదాపు 40రోజుల కిందట జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన ALVM3-M4 రాకెట్ ప్రయాణం చివరికి గమ్యానికి చేరుకొని జాబిల్లిపై త్రివర్ణ పతకాన్ని రేపరెపలాడించింది. ఇకపై చంద్రుడి ఉపరితలంపై తిరగనుంది. ఈ మేరకు అక్కడి రాళ్లు,గుంతలు, వాతావరణ స్థితిగతులపై ఫోటోలు, కీలక సమాచారాన్ని చేరవేస్తుంది. చంద్రయాన్-3 రోవర్ దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అంతరిక్షంలో భారత్ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసింది. ఈ మేరకు ప్రపంచస్థాయిలో చంద్రుడిపై చేసిన గొప్ప ప్రయోగాల్లో చంద్రయాన్-3 చరిత్ర పుటల్లోకి ఎక్కింది.

DETAILS

తొలిసారిగా 2008లో ప్రారంభమైన చంద్రయాన్-1 మిషన్

2008లో తొలిసారిగా చంద్రయాన్-1మిషన్ ను ప్రారంభించారు.చంద్రుడిపై నీటి వనరులు, ఉపరితలంపై పగటి పూట వాతావరణాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు దీన్ని ప్రయోగించారు. ఇది విజయవంతమైంది. 2019లో చంద్రయాన్-2ను ఇస్రో చేపట్టింది. అయితే ఇది పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. చివరి ఘట్టంలో భాగంగా చందమామపై రోవర్ దిగే క్రమంలో సాంకేతికత వైఫల్యంతో ల్యాండర్, రోవర్ క్రాష్ అయ్యాయి. దీంతో దానికి కొనసాగింపుగానే చంద్రయాన్-3ని ఇస్రో ప్రారంభించింది. చంద్రుడిపై ఉత్తర ధ్రువం కంటే నిరంతరం నీడ ఉండే దక్షిణ ధ్రువం చాలా పెద్దది. అందుకే శాశ్వతంగా నీడ ఉండే దీని వద్ద నీటి నిల్వలకు అవకాశం ఎక్కువ. అందుకే చంద్రయాన్ -3 రోవర్‌ను దక్షిణ ధ్రువంపై దించాలని ఇస్రో నిర్ణయించింది. అనుకున్న విధంగానే ఫలితం సాధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇస్రో ట్వీట్