Page Loader
ChatGPT Ghibli Image: చాట్‌జీపీటీలో జీబ్లీ ఇమేజ్'లపై పరిమితిని ఎత్తివేత 
చాట్‌జీపీటీలో జీబ్లీ ఇమేజ్'లపై పరిమితిని ఎత్తివేత

ChatGPT Ghibli Image: చాట్‌జీపీటీలో జీబ్లీ ఇమేజ్'లపై పరిమితిని ఎత్తివేత 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

సామాజిక మాధ్యమాల్లో ప్రసిద్ధి చెందిన జీబ్లీ ఇమేజెస్‌పై ఓపెన్‌ఏఐ (OpenAI) ఒక కీలక ప్రకటన చేసింది. చాట్‌జీపీటీలో ఈ ఫీచర్‌ను ఇకపై ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్‌ వెల్లడించారు. ఫ్రీ యూజర్లకు ఉన్న పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్‌కు పెరుగుతున్న ఆదరణను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు శామ్‌ ఆల్ట్‌మన్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం, జీబ్లీ ఏఐ ఇమేజ్ జనరేషన్‌ సేవలు కేవలం చెల్లింపు సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చాట్‌జీపీటీ ప్లస్‌, ప్రో, టీమ్‌ ప్లాన్స్‌ యూజర్లు అపరిమితంగా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

వివరాలు 

గంట వ్యవధిలోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు

అయితే, ఫ్రీ యూజర్లకు ఇది పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉంది, రోజుకు కేవలం మూడు ఇమేజుల వరకు మాత్రమే రూపొందించుకునే అవకాశం ఉంది. అయితే, తాజా ప్రకటన ప్రకారం, ఈ ఫీచర్‌ను పూర్తిగా ఉచితంగా అందించడంతో పాటు, యూజర్లకు ఉన్న పరిమితినీ తొలగిస్తున్నట్లు శామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు. ఇదిలా ఉండగా, 26 నెలల క్రితం చాట్‌జీపీటీని ప్రారంభించినప్పుడు అద్భుతమైన స్పందన లభించిందని ఆల్ట్‌మన్‌ గుర్తుచేశారు. జీబ్లీ ఫిల్టర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక గంట వ్యవధిలోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు చాట్‌జీపీటీకి చేరినట్లు ఆయన వెల్లడించారు. ఫీచర్‌ను యూజర్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు.

వివరాలు 

అధిక వినియోగం కారణంగా GPU వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి

అయితే, ఈ ఫీచర్‌ను విపరీతంగా వినియోగించడం వల్ల గణనీయమైన సవాళ్లు ఎదురవుతున్నాయని ఆల్ట్‌మన్‌ తెలిపారు. అధిక వినియోగం కారణంగా తమ GPU వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. అందుకే, ఉచిత యూజర్లకు పరిమితి విధించాల్సి వచ్చిందని వివరించారు. మరోవైపు, ఎక్స్‌కు చెందిన గ్రోక్‌లోనూ ఈ ఫొటో జనరేషన్‌ ఫీచర్‌ను యూజర్లు విస్తృతంగా ఉపయోగిస్తున్నారని తెలిపారు.