LOADING...
DeepSeek: చాట్‌జీపీటీ,జెమినీకి పోటీగా డీప్‌సీక్ కొత్త AI మోడళ్లు
చాట్‌జీపీటీ,జెమినీకి పోటీగా డీప్‌సీక్ కొత్త AI మోడళ్లు

DeepSeek: చాట్‌జీపీటీ,జెమినీకి పోటీగా డీప్‌సీక్ కొత్త AI మోడళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ డీప్‌సీక్ (DeepSeek)- చాట్‌బాట్ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓపెన్‌ఏఐ,చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ (Gemini)లకు పోటీగా రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. డీప్‌సీక్-V3.2, డీప్‌సీక్-V3.2-స్పెషాలే (Speciale) పేర్లతో మార్కెట్లోకి తీసుకువచ్చిన ఈ మోడళ్లు అధునాతన రీజనింగ్ సామర్థ్యాలతో పనిచేస్తాయని సంస్థ తెలిపింది. సాధారణ పనుల్లో GPT-5 స్థాయిలో పనితీరు చూపేలా రూపొందించిన డీప్‌సీక్-V3.2 'ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన రీజనింగ్ మోడల్'గా రూపొందించారు. ఇక డీప్‌సీక్-V3.2-స్పెషాలే మోడల్ గూగుల్ తాజా జెమినీ 3 ప్రో స్థాయిలో క్లిష్ట సమస్యల పరిష్కార సామర్థ్యం కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.

వివరాలు 

ప్రోగ్రామింగ్, లాజిక్ సంబంధిత టాస్క్‌ల్లో కూడా అద్భుత ప్రతిభ 

ఇటీవల అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ (IMO), ఇన్‌ఫర్మాటిక్స్ ఒలింపియాడ్ (IOI) వంటి పోటీల్లో గోల్డ్ మెడల్ స్థాయి ఫలితాలు సాధించి సంచలనం సృష్టించిన ఈ మోడల్, స్వచ్ఛ గణిత పరీక్షలు అయిన AIME, HMMTలలో GPT-5 హై, జెమినీ 3 ప్రోకన్నా మెరుగ్గా పనిచేసిందని తెలిపింది. అలాగే ప్రోగ్రామింగ్, లాజిక్ సంబంధిత టాస్క్‌ల్లో కూడా అద్భుత ప్రతిభ చూపిందని పేర్కొంది. 'హ్యూమానిటీ లాస్ట్ ఎగ్జామ్' అనే కఠిన పరీక్షలో GPT-5 హైకన్నా మెరుగ్గా పనిచేసినా,జెమినీ 3 ప్రో స్థాయిని మాత్రం దాటలేకపోయిందని అంచనాలు వెల్లడించాయి.

వివరాలు 

కొత్త మోడళ్లను డీప్‌సీక్ వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా వినియోగానికి అందుబాటులోకి ..

ఈ కొత్త మోడళ్లను డీప్‌సీక్ వెబ్‌సైట్, యాప్‌ల ద్వారా వినియోగానికి అందుబాటులోకి తెచ్చినట్లు తెలియజేశారు. అయితే డీప్‌సీక్-V3.2-స్పెషాలే ప్రస్తుతం కేవలం API వినియోగానికి మాత్రమే అందుబాటులో ఉండగా, సాధారణ వినియోగదారులకు ఎప్పటి నుంచి లభిస్తుందన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదన్నారు.

Advertisement