Page Loader
Nothing Phone 2a Plus : లాంచ్‌కు ముందే నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ ఫీచర్లు లీక్

Nothing Phone 2a Plus : లాంచ్‌కు ముందే నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ ఫీచర్లు లీక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2024
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ జూలై 31న భారతదేశంలో లాంచ్ అవుతుందని నథింగ్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. లాంచ్‌కు ముందు నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ కొన్ని కీలక స్పెసిఫికేషన్లు, మెమరీ వేరియంట్లపై కొన్ని కీలక విషయాలు బయటికొచ్చాయి. ఈ ఫోన్ రాబోయే ఈ హ్యాండ్‌సెంట్ ప్రామాణిక మోడల్‌లో 3 ముఖ్యమైన హార్డ్‌వేర్ మార్పులతో రానున్నట్లు తెలిసింది. ఇందులో 50ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా ఉండనుంది.

Details

అత్యాధునిక ఫీచర్లతో నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED ప్యానెల్, గొరిల్లా గ్లాస్ కలిగి ఉంటుంది. 5,000mAh బ్యాటరీ, 45Wకి బదులుగా 50W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అప్‌గ్రేడ్ కానుంది. 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్‌లలో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ గ్రే, బ్లాక్ అనే రెండు రంగుల్లో రానుంది. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ 12జీబీ వరకు ర్యామ్‌తో మీడియాటెక్ డైమన్షిటీ 7350 చిప్‌సెట్‌తో అందిస్తుందని ఆ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది.