Crew-10 mission: ఐఎస్‌ఎస్‌లోకి క్రూ-10 విజయవంతంగా ప్రవేశం.. సునీతా విలియమ్స్ రాకకు మార్గం సుగమం
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ (Butch Wilmore) భూమికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది.
వారిని భూమికి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్‌ఎక్స్ ప్రయోగించిన క్రూ-10 మిషన్ (Crew-10 mission) ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది.
ఈ ప్రక్రియ ఆదివారం ఉదయం 9:37 గంటలకు పూర్తి అయినట్లు నాసా వెల్లడించింది. స్పేస్‌ఎక్స్ దీనికి సంబంధించిన వీడియోను పంచుకుంది.
Details
ఫాల్కన్-9 ద్వారా ఐఎస్‌ఎస్‌కు చేరిన కొత్త వ్యోమగాములు
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో ఐఎస్‌ఎస్‌లో పనిచేయడానికి తాజాగా నలుగురు వ్యోమగాములు అక్కడికి వెళ్లారు.
క్రూ డ్రాగన్ వ్యోమనౌక శనివారం తెల్లవారుజామున 4:33 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయాణం ప్రారంభించింది.
ఫాల్కన్-9 రాకెట్ ఈ వ్యోమనౌకను నింగిలోకి మోసుకెళ్లింది.
క్రూ-10 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న నూతన వ్యోమగాములు
ఆన్ మెక్‌క్లెయిన్ (అమెరికా)
నికోల్ అయర్స్ (అమెరికా)
టకుయా ఒనిషి (జపాన్)
కిరిల్ పెస్కోవ్ (రష్యా)
ఇలా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ పునరాగమనం కోసం మార్గం సిద్ధమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీడియో రిలీజ్ చేసిన స్పేస్ ఎస్
Docking confirmed! pic.twitter.com/zSdY3w0pOS
— SpaceX (@SpaceX) March 16, 2025