
Cybercrime: రూ.19 వేలు లాభం చూపించి, రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన ఓ 30 ఏళ్ల అకౌంటెంట్ సైబర్ నేరగాళ్ల కుట్రకు బలై భారీగా నష్టపోయాడు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో బాధితుడి నుంచి రూ.10.10 కోట్లు కాజేశారు.
అక్టోబర్ 2న, అకౌంటెంట్ ఫోన్ నంబర్‌ను 'ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా వెల్త్' పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఈ గ్రూప్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అవగాహన కల్పించేవారు.
'చేతన్ సెహగల్' అనే వ్యక్తి పెట్టుబడులపై సలహాలు ఇచ్చి, అతని సహాయకురాలిగా మీరాదత్ పేరుతో మరో వ్యక్తి బాధితునితో నేరుగా మాట్లాడారు.
అధిక లాభాల కోసం 'వీఐపీ ట్రేడింగ్ ఖాతా' తెరవాలని సూచించిన నిందితులు, అక్టోబర్ 17న రూ.లక్ష పెట్టుబడి పెట్టించగా, ఆ యాప్‌లో వర్చువల్ లాభాలు చూపించారు.
Details
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
ఆ లాభాలను చూసి మరింత పెట్టుబడులకు ప్రేరేపించి నవంబర్ 4 వరకు రూ.10.10 కోట్ల పెట్టుబడులను డిపాజిట్ చేయించుకున్నారు.
వర్చువల్ లావాదేవీలలో రూ.24.36 కోట్ల లాభం వచ్చినట్లు చూపించి, మొత్తం డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే అదనంగా మరో రూ.3 కోట్లు బదిలీ చేయాలని కోరారు.
దాంతో మోసాన్ని గ్రహించిన బాధితుడు, వెంటనే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.