LOADING...
Disney: ఓపెన్‌ఏఐలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టిన డిస్నీ.. సోరాకి క్యారెక్టర్ లైసెన్స్ ఒప్పందం
సోరాకి క్యారెక్టర్ లైసెన్స్ ఒప్పందం

Disney: ఓపెన్‌ఏఐలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టిన డిస్నీ.. సోరాకి క్యారెక్టర్ లైసెన్స్ ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

డిస్నీ, ఓపెన్‌ఏఐలో భారీగా $1 బిలియన్ పెట్టుబడి పెట్టింది. సోరా ప్లాట్‌ఫాంపై ఇది మొదటి పెద్ద లైసెన్సింగ్ డీల్‌గా నమోదైంది. ఈ ఒప్పందంతో వినియోగదారులు డిస్నీకి చెందిన 200కి పైగా ప్రసిద్ధ కార్టూన్ క్యారెక్టర్లతో వీడియోలు క్రియేట్ చేసుకునే అవకాశం పొందుతున్నారు. డీల్లో భాగంగా డిస్నీకి చెందిన ప్రముఖ పాత్రలు సోరాపై ఉపయోగించడానికి ప్రత్యేక లైసెన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం.

క్యారెక్టర్ ఇంక్లూషన్ 

సోరాలో డిస్నీ క్యారెక్టర్‌లకు ఎంట్రీ

ఈ ఒప్పందం వల్ల ఓపెన్‌ఏఐ రూపొందించిన షార్ట్‌ఫార్మ్ వీడియో జనరేషన్ ప్లాట్‌ఫాం సోరా వినియోగదారులు మిక్కీ, మిన్నీ మౌస్ వంటి క్లాసిక్ క్యారెక్టర్లతో పాటు Frozen, Moana, Toy Story వంటి ఆధునిక ఫ్రాంచైజీల క్యారెక్టర్లతో కూడా వీడియోలు తయారు చేయగలరు. అదేవిధంగా Marvel, Lucasfilm యూనివర్స్‌లోని Black Panther, Star Wars‌లోని యోడా వంటి పాత్రలు కూడా ఈ లైసెన్సింగ్ డీల్‌లో భాగమయ్యాయి.

క్రియేటర్ రక్షణ 

క్రియేటర్ల ఆందోళనలపై స్పందించిన డిస్నీ CEO

క్రియేటర్లకు ఈ ఒప్పందం వల్ల ప్రమాదం ఏమీ లేదని డిస్నీCEO రాబర్ట్ A. ఐగర్ స్పష్టం చేశారు. ఈ డీల్ క్రియేటర్లకే గౌరవం ఇచ్చేదని, పైగా లైసెన్సింగ్ ఫీజు కూడా ఉండటం వలన వారికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. సోరాలో క్యారెక్టర్ల వాడకం ఎలా జరుగుతుందనే విషయంలో ఓపెన్‌ఏఐపై తమకు పూర్తి నమ్మకం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

Advertisement

AI భాగస్వామ్యం 

డిస్నీతో భాగస్వామ్యంపై ఓపెన్‌ఏఐ CEO స్పందన

ఓపెన్‌ఏఐ సహ వ్యవస్థాపకుడు, CEO సామ్ ఆల్ట్‌మాన్‌ కూడా ఈ ఒప్పందంపై స్పందించారు. "స్టోరీటెల్లింగ్‌లో డిజ్నీకి గ్లోబల్ గోల్డ్ స్టాండర్డ్ ఉన్నది. సోరా, ChatGPT Images ద్వారా ప్రజలు కంటెంట్‌ను సృష్టించే విధానాన్ని మరోస్థాయికి తీసుకెళ్లే అవకాశం లభించడం మా అదృష్టం" అని చెప్పారు. ఈ ఒప్పందం AI కంపెనీలు, క్రియేటివ్ రంగ నాయకులు కలిసి బాధ్యతతో పనిచేసి సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఇన్నోవేషన్‌కి మార్గం చూపుతుందని ఆయన అన్నారు.

Advertisement

డీల్ ప్రత్యేకత 

ఓపెన్‌ఏఐ-డిస్నీ ఒప్పందంలో ఎక్స్‌క్లూజివిటీ

మూడు సంవత్సరాల పాటు ఉండే ఈ ఒప్పందంలో కొంత ఎక్స్‌క్లూజివిటీ ఉంటుందని ఐగర్ సూచించారు. అయితే ఆ వివరాలను ఇంకా వెల్లడించలేదు. భవిష్యత్తులో మరో కంపెనీలతో ఇలాంటి ఒప్పందాలు చేస్తారా? అనే ప్రశ్నకి సామ్ ఆల్ట్‌మాన్‌ స్పందిస్తూ, భవిష్యత్తులో అవకాశాలను వదిలేయలేమన్నా, ప్రస్తుతం డిస్నీతో ఉన్న ఈ భాగస్వామ్యం చాలా మంచి ఆరంభమని చెప్పారు.

Advertisement