
7,000 మంది ఉద్యోగుల తొలగించనున్న డిస్నీ
ఈ వార్తాకథనం ఏంటి
డిస్నీ సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి 7,000 మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. ఇటీవలే తమ త్రైమాసిక ఆదాయాన్ని ప్రకటించిన వెంటనే ఈ నిర్ణయం ప్రకటించింది.
మిగిలిన టెక్ కంపెనీల లాగానే డిస్నీ కూడా ప్రస్తుత ఆర్ధిక స్థితిలో ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటోంది. గత నవంబర్‌లో అప్పటి సిఈఓ బాబ్ చాపెక్ నుండి రాబర్ట్ ఇగర్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిస్నీ ఖర్చు తగ్గించడం, తొలగింపుల కోసం ప్రణాళికను ప్రారంభించిందని నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ ఉద్యోగులను తగ్గించాలనే నిర్ణయంతో సహా సంస్థలో కొన్ని ముఖ్యమైన మార్పులను ప్రారంభించింది.
డిస్నీకి నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే చందాదారుల వృద్ధి తగ్గింది. డిస్నీ ప్లస్ US,కెనడాలో కేవలం 200,000 సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే పెరిగి, 46.6 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లకు చేరుకుంది.
డిస్నీ
సంస్థకు $5.5 బిలియన్ల ఖర్చును ఆదా చేయడం లక్ష్యం అంటున్న సిఈఓ ఇగెర్
ఇది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల ప్రతిభ అంకితభావం పట్ల అపారమైన గౌరవం ఉందని ఇగర్ సృష్టం చేశారు. సంస్థకు $5.5 బిలియన్ల ఖర్చును ఆదా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ నిర్ణయం అది సాధించడంలో సహాయపడుతుందని చెప్పారు.
స్ట్రీమింగ్ వ్యాపారం శాశ్వత వృద్ధి, లాభదాయకత మా ప్రాధాన్యత అని. ప్రస్తుత అంచనాలు 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డిస్నీ ప్లస్ లాభదాయకతను సాధిస్తుందని సూచిస్తున్నాయని ఇగెర్ చెప్పారు. అయితే, తొలగింపులు వలన ఏ విభాగాలపై ప్రభావం పడుతుందో వెల్లడించలేదు.
డిపార్ట్‌మెంట్ల పునర్నిర్మాణం విషయానికొస్తే, ఇప్పుడు డిస్నీ ఎంటర్‌టైన్‌మెంట్, ఈఎస్‌పిఎన్ డివిజన్, పార్క్స్, ఎక్స్‌పీరియన్స్ అండ్ ప్రొడక్ట్స్ యూనిట్ అనే మూడు విభాగాలుగా చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.