Page Loader
Laser Weapon System: డీఆర్డీవో ఘన విజయం.. శత్రుద్రోన్లకు చెక్‌ పెట్టే లేజర్‌ వెపన్‌ పరీక్షా సక్సెస్
డీఆర్డీవో ఘన విజయం.. శత్రుద్రోన్లకు చెక్‌ పెట్టే లేజర్‌ వెపన్‌ పరీక్షా సక్సెస్

Laser Weapon System: డీఆర్డీవో ఘన విజయం.. శత్రుద్రోన్లకు చెక్‌ పెట్టే లేజర్‌ వెపన్‌ పరీక్షా సక్సెస్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
09:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం తన రక్షణ రంగాన్ని మరింత శక్తివంతం చేసుకునే దిశగా కీలకమైన అడుగు వేసింది. శత్రు డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేసే సామర్థ్యంతో కూడిన లేజర్‌ ఆయుధ వ్యవస్థను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (DRDO) ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో తొలిసారిగా 30 కిలోవాట్ల శక్తితో కూడిన లేజర్‌ బేస్డ్‌ వెపన్‌ సిస్టమ్‌ను ఆదివారం పరీక్షించగా, అది పూర్తి విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీ అమెరికా, చైనా, రష్యాల వద్ద మాత్రమే ఉండగా, ఇప్పుడు భారత్‌ కూడా ఈ ప్రతిష్ఠాత్మక క్లబ్‌లో చేరింది. ఈ సాంకేతికతను ప్రదర్శించిన నాలుగో దేశంగా భారత్‌ నిలిచింది.

Details

ఇది ఆరంభం మాత్రమే

ఈ సందర్భంగా DRDO చైర్మన్‌ డాక్టర్‌ సమీర్‌ వి కామత్‌ మాట్లాడుతూ, "ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ విజయానికి అనేక ప్రయోగశాలలు, పరిశ్రమలు, అకడమిక్‌ ఇన్‌స్టిట్యూషన్లు కలిసి పనిచేశాయి. త్వరలోనే మనం గమ్యానికి చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. లేజర్‌ వెపన్‌ టెక్నాలజీ 'స్టార్ వార్స్' తరహాలో శక్తివంతమైన రక్షణ సామర్థ్యాన్ని ఇస్తుందని ఆయన వివరించారు. లేజర్‌ ఆయుధ వ్యవస్థలను ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ప్రదర్శించాయి అని పేర్కొన్న ఆయన, ఇజ్రాయెల్‌ కూడా ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తోందని చెప్పారు. అదే సందర్భంలో, అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (AMCA) గురించి కూడా ఆయన మాట్లాడారు.

Details

 ఇంజిన్‌ టెక్నాలజీ సిక్స్‌ జనరేషన్‌ దిశగా ముందుకు

ఐదో తరం స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌గా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టుకు కాబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ అనుమతి లభించిందని, 2024లో ఈ ప్రయాణాన్ని ప్రారంభించామని తెలిపారు. 2035 నాటికి దీనిని operational చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా AERO ఇంజిన్‌ ప్రాజెక్టును ప్రారంభించేందుకు కూడా DRDO యోచిస్తున్నదని చెప్పారు. ఇది అత్యంత క్లిష్టమైన టెక్నాలజీ కావడంతో, ప్రమాదాలను తగ్గించేందుకు ఒక విదేశీ Original Equipment Manufacturer (OEM) సంస్థతో కలసి పని చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. కావేరి ఇంజిన్‌ నుంచి DRDO ఎంతో నేర్చుకున్నప్పటికీ, ప్రస్తుతం ఇంజిన్‌ టెక్నాలజీ సిక్స్‌ జనరేషన్‌ దిశగా వెళ్లినట్లు డాక్టర్‌ కామత్‌ పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రయోగం సక్సెస్