Page Loader
ISS: అంతరిక్షం నుంచి రాత్రివేళలో భారత్‌ మెరిసిపోతోంది.. ఐఎస్ఎస్ ఫోటో వైరల్‌
అంతరిక్షం నుంచి రాత్రివేళలో భారత్‌ మెరిసిపోతోంది.. ఐఎస్ఎస్ ఫోటో వైరల్‌

ISS: అంతరిక్షం నుంచి రాత్రివేళలో భారత్‌ మెరిసిపోతోంది.. ఐఎస్ఎస్ ఫోటో వైరల్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ISS) తాజాగా భూమి మీదుని కొన్ని అద్భుతమైన చిత్రాలను సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేసింది. అందులో భారతదేశం రాత్రి వేళ వెలుగులతో మెరుస్తున్న దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది. "పైన నక్షత్రాలు, కింద నగరాల వెలుగులు.. అట్మాస్ఫెరిక్ గ్లోతో భూమి అంచు' అంటూ ఐఎస్ఎస్ తన పోస్టులో పేర్కొంది. ఈ ఫోటోలో భారతదేశం ప్రజాభారిత ప్రాంతాలు ప్రకాశించే కాంతిక్లస్టర్లుగా కనిపించాయి. చీకటి నిశీథంలో దేశం ఎంత అందంగా మెరిసిపోతోందో స్పష్టంగా కనిపించింది.

Details

 భిన్న ప్రదేశాల చిత్రాలతో ఐఎస్ఎస్

భారత్‌తో పాటు మరిన్ని ప్రాంతాల దృశ్యాల్ని కూడా ISS పంచుకుంది. అమెరికాలోని మిడ్‌వెస్ట్ ప్రాంతంపై ఉన్న క్లౌడ్ ప్యాటర్న్‌లను చూపించిన చిత్రం ఆసియా ప్రాంతంలోని భూమి, నీటి మేళవింపు.. మధ్యలో తేలికపాటి మేఘాలు అలాగే కెనడా రాత్రివేళ చిత్రంలో నగరాల వెలుగులు, ఆకాషంలో ఓ అద్భుతమైన ఆకుపచ్చ ఆరొరా కనిపించాయి.

Details

భూమి చుట్టూ 370-460 కిమీ ఎత్తులో ISS

నాసా ప్రకారం, ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ భూమి చుట్టూ 370 కిమీ నుంచి 460 కిమీ మధ్య ఎత్తులో ఆర్బిట్ చేస్తుంది. ఈ ప్రత్యేక స్థితి వల్లే భూమి మీదని ఎన్నో అద్భుత దృశ్యాలను ఎప్పటికప్పుడు ప్రపంచంతో పంచుకుంటోంది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. "అంతరిక్షం నుంచి మన భూమి ఎంత అందంగా ఉంటుందో చూశాం," అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐఎస్ఎస్ విడుదల చేసిన చిత్రాలివే