Loading...
Floating Data Centers: సముద్రంలో తేలాడే డేటా సెంటర్స్‌....యువ స్టార్టప్ వినూత్న ఆలోచన
సముద్రంలో తేలాడే డేటా సెంటర్స్‌....యువ స్టార్టప్ వినూత్న ఆలోచన

Floating Data Centers: సముద్రంలో తేలాడే డేటా సెంటర్స్‌....యువ స్టార్టప్ వినూత్న ఆలోచన

వ్రాసిన వారు Balachander Sharma
Nov 15, 2026
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు విద్యుత్ అవసరం కూడా భారీగా పెరుగుతోంది. ఈ సమస్యకు సముద్రం నుంచే పరిష్కారం చూపించాలనుకుంటోంది అమెరికాకు చెందిన యువ స్టార్టప్ డ్రోగ్ (Drogue). సముద్ర ఉపరితలంలోని వేడి, లోతైన నీటిలోని చల్లదనాన్ని ఉపయోగించి విద్యుత్ తయారు చేసి.. సముద్రంలో తేలియాడే నౌకలపైనే డేటా సెంటర్లను నడపాలన్నది సంస్థ ఆలోచన. ఆరు నెలల క్రితమే ప్రారంభమైన ఈ స్టార్టప్ ఇప్పటికే 20 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించడం విశేషం.

Details

రెండేళ్లలో తొలి ప్రోటోటైప్

డ్రోగ్ వ్యవస్థలో భాగంగా మల్టీ-మెగావాట్ సామర్థ్యంతో తొలి ప్రోటోటైప్‌ను సిద్ధం చేస్తున్నారు.

2028 ప్రారంభంలో దీన్ని ఓ సాధారణ సముద్ర నౌకపై ఏర్పాటు చేసి సముద్రంలోకి పంపే ప్రణాళిక ఉంది.

తర్వాతి దశలో ఆయిల్ ప్లాట్‌ఫామ్‌లను పోలిన తేలియాడే నిర్మాణాలపై మరింత పెద్ద డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది.

ఒక్కో నౌక సముద్రంలో దాదాపు పదేళ్లపాటు పనిచేసేలా ఈ కాన్సెప్ట్‌ను రూపొందిస్తున్నారు.

Details

వేడి నీరు.. చల్లని నీటితో విద్యుత్

డ్రోగ్ టెక్నాలజీ వెనుక ఉన్న ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సముద్రం పైభాగంలోని వేడి నీటిని తీసుకుని డేటా సెంటర్‌ను చల్లబరుస్తారు.

ఆ తర్వాత ఆ వేడి నీటిని అమ్మోనియాను ఆవిరిగా మార్చేందుకు ఉపయోగిస్తారు. ఆ వాయువు టర్బైన్‌ను తిప్పడంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

అనంతరం దాదాపు 1,000 మీటర్ల లోతు నుంచి తీసుకొచ్చే చల్లని నీటితో అమ్మోనియాను మళ్లీ ద్రవంగా మారుస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.

ADVERTISEMENT

Details

సముద్రంలోనే డేటా సెంటర్ ఎందుకు?

సముద్రం నుంచి విద్యుత్‌ను భూమిపైకి తీసుకురావడానికి భారీ కేబుళ్లు అవసరం.

దానికి బదులుగా విద్యుత్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందో అక్కడే డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తే ఖర్చు, సమయం రెండూ తగ్గుతాయని డ్రోగ్ భావిస్తోంది.

ఏఐ అవసరాలు గత మూడేళ్లలో దాదాపు 10 రెట్లు పెరిగిన నేపథ్యంలో వేగంగా డేటా సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది.

సముద్రంలో తేలియాడే ఈ కేంద్రాలు ఆ అవసరానికి కొత్త మార్గంగా మారవచ్చని సంస్థ ఆశిస్తోంది.

ADVERTISEMENT

Details

పాత ఆలోచనకు కొత్త టెక్నాలజీ

సముద్ర ఉష్ణోగ్రతల తేడాతో విద్యుత్ ఉత్పత్తి చేసే OTEC విధానం కొత్తది కాదు. 1950లలోనే దీనిపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి.

1980లలో కూడా ఈ ఆలోచనను పరీక్షించారు. కానీ అప్పటి తయారీ సాంకేతికత, పైపులు, హీట్ ఎక్స్ఛేంజర్ల పరిమితులతో ప్రాజెక్టులు ముందుకు సాగలేదు.

ఇప్పుడు తయారీ రంగంలో వచ్చిన మార్పులతో అదే ఆలోచనను భారీ స్థాయిలో అమలు చేయవచ్చని డ్రోగ్ చెబుతోంది. ఇప్పటికే అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్ నుంచి ప్రాథమిక అనుమతి కూడా పొందింది.

ADVERTISEMENT