సరికొత్త ఫీచర్లతో డుకాటీ మాన్స్టర్ ఎస్‌పీ బైక్ వచ్చేసిందోచ్
డుకాటీ మాన్స్టర్ ఎస్‌పీ బైక్ భారత్ మార్కెట్లోకి సరికొత్తగా అడుగుపెట్టింది. స్టాండర్ట్ మోడల్స్ తో పోలిస్తే చాలా అప్ గ్రేడ్ లతో ఎస్ పీ వెర్సన్ ముందుకొచ్చింది. డుకాటీ ఇండియా మంగళవారం ఈ బైక్ ను విడుదల చేసింది. డీలర్ షిప్ ల వద్ద బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. 937cc ఇంజిన్ తో ఈ పవర్ ఫుల్ బైక్ రానుంది. ప్రస్తుతం డుకాటీ మాన్‌స్టర్ ఎస్ పీ బైక్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.. 937cc లిక్విడ్ కూల్డ్, 4 వాల్వ్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ ను డుకాటీ మాన్స్టర్ ఎస్‌పీ బైక్ కలిగి ఉంది. 6-స్పీడ్ గేర్ బాక్సు, క్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్ సదుపాయాలు ఉంటాయి.
డుకాటీ మాన్స్టర్ ఎస్‌పీ బైక్ ధర రూ.15.95 లక్షలు
ఎస్‌సీ బైక్ ఫ్రంట్ లో సస్పెన్షన్ కోసం 44mm డయామీటర్ ఓహ్లిన్స్ అప్ సైడ్ డౌన్ ఫోర్క్య్ ఉండనున్నాయి. అల్యూమినియమ్ స్పింగ్ర్, స్టీరింగ్ డ్యాంపర్, టెర్మిగ్నోనీ సైలెన్సర్‌తో ఈ బైక్ రావడం దీని ప్రత్యేకత. ఈ బైక్ 4.3 ఇంచుల కలర్ TFT ఇన్ స్ట్రుమెంటర్ క్లస్టర్ డిస్ ప్లే, మూడులెవెళ్లతో కూడిన కార్నరింగ్ ఏబీఎస్, ఎల్ఈడీ లైట్లతో ఈ బైక్ వస్తోంది. దీని బరువు మొత్తంగా 186 కేజీలు ఉండనుంది. స్టాండర్ట్ మోడల్ తో పోలిస్తే ఇది 2 కేజీలు తక్కువ. డుకాటీ మాన్స్టర్ ఎస్‌పీ బైక్ ధర రూ.15.95 లక్షలు ఉండనుంది. కవాసాకీ జెడ్ 900, ట్రైంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ లను ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.