Page Loader
ఏఐ రంగంలోకి ప్రవేశించిన ఎలోన్‌ మస్క్‌.. xAI పేరిట కంపెనీ ఏర్పాటు 
చాట్‌జీపీటీకి ఏఐ (xAI) గట్టి పోటీ

ఏఐ రంగంలోకి ప్రవేశించిన ఎలోన్‌ మస్క్‌.. xAI పేరిట కంపెనీ ఏర్పాటు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 13, 2023
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఇంటర్నేషనల్ వ్యాపార దిగ్గజం ఎలోన్‌ మస్క్‌ సరికొత్త వ్యాపారానికి తెరలేపారు. ఈ మేరకు ఓ కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ స్టార్టప్‌ యూనిట్ ను ఎక్స్‌ ఏఐ (xAI) పేరిట ప్రారంభించారు. ఈ ఏఐ కోసమే గూగుల్‌, ఓపెన్‌ ఏఐతో పాటు యూఎస్ఏ లోని ఇతర పేరు గాంచిన సాంకేతిక సంస్థలకు చెందిన వేర్వేరు నిపుణులకు నియామకాలను అందించారు. మస్క్ కొత్త బృందంలో ఇగోర్ బాబూస్కిన్, గూగుల్‌ టోనీ వు, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లో పనిచేసిన రీసెర్చ్‌ సైంటిస్ట్‌ స్జెగెడీ మస్క్‌ తదితరులు నియమకామయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రఖ్యాత చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇవ్వాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగానే తన కొత్త సంస్థను వేగంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారని సమాచారం.

DETAILS

ఏఐ అంటే పైలెట్ లేని విమానం లాంటిది : మస్క్ 

గత కొంత కాలంగా మస్క్‌ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారంగా రానున్న టెక్నాలజీని ముందే పసిగట్టారు. ఈ మేరకు వాటితో వచ్చే ప్రమాదాలను వివరించారు. ఈ క్రమంలోనే ఏఐ సాంకేతికతపై మస్క్ స్పందిస్తూ అది పైలట్ లేని విమానం లాంటిదన్నారు. ఏఐ అణుబాంబుతో సమానమని అన్నారు. కృత్రిమ మేధస్సు మానవ ఉనికినే నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఏఐని నియంత్రించేందుకు ఓ రెగ్యూలేషన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయాలు జరగాలని ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏఐలోని వాస్తవాలకు కొత్త అర్ధం వచ్చేలా ఎక్స్‌ఏఐని స్థాపించామన్నారు. ఈ మేరకు ఏఐ సంస్థ జులై 14న ట్విట్టర్ స్పేస్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

xAI పేరిట కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన మస్క్