
GSAT-20: నింగిలోకి దూసుకెళ్లిన 4,700 కిలోల జీశాట్-20 ఉపగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం జీశాట్-20 (జీశాట్-N2) విజయవంతంగా నింగిలోకి ప్రవేశించింది.
స్పేస్-X కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది.
ఈ ప్రాముఖ్యమైన ప్రయోగం అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరల్ నుంచి నిర్వహించారు.
మొత్తం 34 నిమిషాల ప్రయాణం అనంతరం జీశాట్-20ను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
తరువాత, హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నిర్వహణలోకి తీసుకుంటుంది.
వివరాలు
ఇస్రో , స్పేస్‌ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం
ఇస్రో చీఫ్ సోమనాథ్, ప్రయోగానికి ముందు తమ టీమ్‌కు విజయకాంక్షలు తెలియజేశారు.
4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భారతీయ రాకెట్లు మోసుకెళ్లడం సాధ్యంకాకపోవడంతో, స్పేస్‌ఎక్స్ సహకారాన్ని వినియోగించారు.
జీశాట్-20 ఉపగ్రహం 14 ఏళ్లపాటు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది.
ఈ ఉపగ్రహం ద్వారా భారత్‌లోని పల్లెలు, మారుమూల ప్రాంతాలు, అలాగే అండమాన్-నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీప ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
అంతేకాకుండా, అధునాతన బ్యాండ్ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా రూపొందించిన ఈ ఉపగ్రహం, విమాన ప్రయాణాల్లో వై-ఫై సేవలను కూడా మరింత విస్తృతం చేయనుంది.
వాణిజ్య పరంగా ఇస్రో , స్పేస్‌ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం కావడం విశేషం.