LOADING...
X: ఎక్స్‌లో AI కంటెంట్‌కు చెక్.. వివరాలు వెల్లడించకుంటే క్రియేటర్ల రెవెన్యూ 90 రోజులు సస్పెన్షన్
వివరాలు వెల్లడించకుంటే క్రియేటర్ల రెవెన్యూ 90 రోజులు సస్పెన్షన్

X: ఎక్స్‌లో AI కంటెంట్‌కు చెక్.. వివరాలు వెల్లడించకుంటే క్రియేటర్ల రెవెన్యూ 90 రోజులు సస్పెన్షన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (మునుపటి ట్విట్టర్) కంటెంట్ క్రియేటర్లకు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో తయారు చేసిన యుద్ధ సంబంధిత వీడియోలను ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసే సమయంలో అవి ఏఐతో రూపొందించినవని స్పష్టంగా తెలియజేయాలని హెచ్చరించింది. అలాంటి వివరాలు వెల్లడించకుండా వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన క్రియేటర్లను రెవెన్యూ-షేరింగ్ ప్రోగ్రామ్ నుంచి 90 రోజుల పాటు సస్పెండ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

వివరాలు 

తప్పుడు సమాచారం నివారించడమే లక్ష్యం

ఈ కొత్త మార్గదర్శకాలను ఎక్స్ ప్రొడక్ట్ హెడ్ నికితా బేర్ వెల్లడించారు. యుద్ధ పరిస్థితుల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో, ప్లాట్‌ఫామ్‌లో నిజమైన సమాచారాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. "ప్రస్తుత ఏఐ టెక్నాలజీ ద్వారా ప్రజలను సులభంగా తప్పుదారి పట్టించే విధంగా కంటెంట్ రూపొందించడం సాధ్యమవుతోంది. అందుకే పారదర్శకతను పెంచే ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకొస్తున్నాం" అని నికితా బేర్ వివరించారు. మొదటిసారి నిబంధనలు ఉల్లంఘించినవారిని 90 రోజులు సస్పెండ్ చేస్తామని, ఆ తర్వాత కూడా తప్పిదం పునరావృతమైతే రెవెన్యూ ప్రోగ్రామ్ నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

వివరాలు 

ఏఐ కంటెంట్‌ను గుర్తించే ప్రత్యేక వ్యవస్థ

ఏఐతో రూపొందించిన కంటెంట్‌ను గుర్తించేందుకు ఎక్స్ ఇప్పటికే పలు పద్ధతులను అమలు చేస్తున్నట్లు నికితా తెలిపారు. కమ్యూనిటీ నోట్స్ వ్యవస్థతో పాటు ఏఐ టూల్స్ మెటాడేటాను ఉపయోగించి ఇలాంటి వీడియోలను గుర్తించనున్నట్లు చెప్పారు. అలాగే 'Made with AI' అనే ప్రత్యేక లేబుల్‌ను కూడా ప్లాట్‌ఫామ్‌లో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో ఎక్స్‌లో ట్రాఫిక్ గణనీయంగా పెరిగి, ఆల్-టైమ్ రికార్డు స్థాయికి చేరినట్లు ఎలాన్ మస్క్, నికితా బేర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

వివరాలు 

మస్క్ సంపదకు కొత్త రికార్డు

ఇదిలా ఉండగా టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంపద చరిత్రలోనే తొలిసారిగా 800 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఆయనకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ, అలాగే ఏఐ స్టార్టప్ xAIను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ మొత్తం ఆస్తుల విలువ సుమారు 852 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఆయన తన స్థానం మరింత బలపరిచారు.

Advertisement