Page Loader
Elon Musk: మెసేజింగ్ యాప్ ను 'స్పైవేర్' అన్న ఎలాన్ మస్క్ 
మెసేజింగ్ యాప్ ను 'స్పైవేర్' అన్న ఎలాన్ మస్క్

Elon Musk: మెసేజింగ్ యాప్ ను 'స్పైవేర్' అన్న ఎలాన్ మస్క్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2024
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X యజమాని ఎలాన్ మస్క్ మరోసారి మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్‌ను టార్గెట్ చేశారు. ఎక్స్‌లో ఒక పోస్ట్‌పై స్పందిస్తూ,ఎలాన్ మస్క్ వాట్సాప్‌ను 'స్పైవేర్' అని పిలిచారు. వాట్సాప్‌పై మస్క్ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో వాట్సాప్ వినియోగదారుల డేటాను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

వివరాలు 

వాట్సాప్ ను మస్క్  స్పైవేర్‌ అని ఎందుకు అన్నాడు? 

డాడ్జ్ డిజైనర్ అనే వినియోగదారు తన స్నేహితుడితో వాట్సాప్‌లో బ్యాగ్ గురించి మాట్లాడిన, 2 గంటల తర్వాత, అతను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాగ్‌కు సంబంధించిన ప్రకటనను చూశాడని ఎక్స్-పోస్ట్‌లో చెప్పాడు. 'వాట్సాప్ సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయితే, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాగ్ ప్రకటనలను ఎందుకు చూశాను ?' అంటూ వినియోగదారుడు ప్రశ్నిస్తూ, పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దీనికి మస్క్ స్పందిస్తూ, 'ఎందుకంటే ఇది స్పైవేర్' అని రాశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇక్కడ పోస్ట్ చూడండి