EV AIR TAXI : భారతదేశంలో విద్యుత్ ఎయిర్ టాక్సీ.. తొలి టాక్సీ ఎక్కడ నడవనుందో తెలుసా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో విద్యుత్ వాహకంగా నడిచే ఎయిర్ టాక్సీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా త్వరలోనే ఈ కొత్త ఈవీ వాహనం గాల్లో ఎగరనుంది.
ఈ మేరకు 2026లో పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా ఆవిష్కరిస్తామని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది.
ఆర్చర్ ఏవియేషన్‌తో కలిసి సంయుక్తంగా రూపొందిస్తున్న ఇంటర్‌గ్లోబ్-ఆర్చర్ ఎయిర్‌టాక్సీని దిల్లీలోని కన్నాట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్‌కు నడిపిస్తామని సంస్థ ప్రకటించింది.
ఈ రెండు ప్రాంతాల మధ్య రోడ్డు ప్రయాణం చేయాలంటే సుమారుగా గంట నుంచి 90 నిమిషాల సమయం పడుతుంది.
అయితే ఎయిర్ టాక్సీ అమల్లోకి వచ్చాక ఈ ప్రయాణం కేవలం 7 నిమిషాల్లోనే చేయవచ్చని స్పష్టం చేసింది.
details
ఒక్కో టాక్సీలో ఎంత మంది ప్రయాణం చేయవచ్చంటే..
ఇదే సమయంలో భారత్‌లో పూర్తి విద్యుత్ ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించడం, దాని నిర్వహణకు అవగాహనా ఒప్పందాన్ని(MOU)ను ఇరు కంపెనీలు ఖరారు చేసుకోవడం విశేషం.
ఇందులో భాగంగానే ఇంటర్‌గ్లోబ్ గ్రూప్ ఎండీ రాహుల్ భాటియా, ఆర్చర్ సీసీఓ నిఖిల్ గోయెల్ ఎమ్‌ఓయూపై సంతకాలు చేశారు. అయితే ఎయిర్ టాక్సీ సేవలకు సంబంధిత నియంత్రణ అనుమతులు రావాల్సి ఉంది.
ఏ,బీ గ్రేడ్ టౌన్ లల్లో ఎయిర్ టాక్సీ సేవలు సహా కార్గో, లాజిస్టిక్స్, వైద్యం, అత్యవసర సేవలకూ వీటిని ఉపయోగించనున్నారు. మరోవైపు చార్టర్ సేవలూ అందిస్తామని సంస్థ తెలిపింది.
ఇండియాలో సేవలు అందించేందుకు దాదాపు 200 ఎయిర్‌ట్యాక్సీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఒక్కో టాక్సీలో నలుగురు ప్రయాణం చేసే వీలుందని స్పష్టం చేసింది.