LOADING...
NASA: ఐఎస్‌ఎస్‌కు నలుగురు కొత్త వ్యోమగాములు.. నాసా వేగవంతమైన చర్యలు
ఐఎస్‌ఎస్‌కు నలుగురు కొత్త వ్యోమగాములు.. నాసా వేగవంతమైన చర్యలు

NASA: ఐఎస్‌ఎస్‌కు నలుగురు కొత్త వ్యోమగాములు.. నాసా వేగవంతమైన చర్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 14, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనారోగ్య కారణాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రప్పించిన నలుగురు వ్యోమగాముల స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో నలుగురు అస్ట్రోనాట్లు బయలుదేరారు. అమెరికాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి SpaceX రాకెట్‌లో వారు శుక్రవారం ప్రయాణం ప్రారంభించారు. శనివారం వారు ఐఎస్‌ఎస్‌కు చేరుకోనున్నారు. దాదాపు తొమ్మిది నెలలపాటు అక్కడే ఉండి పలు అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొంటారు. ఈ బృందంలో అమెరికా వ్యోమగాములు జెస్సికా మెయిర్, జాక్ హాత్వే, ఫ్రాన్స్‌కు చెందిన సోఫీ అడెనోట్, రష్యా వ్యోమగామి ఆండ్రీ ఫెడ్యాయేవ్ఉన్నారు. ఈ మిషన్‌కు జెస్సికా మెయిర్ నాయకత్వం వహిస్తున్నారు.

Details

ఐఎస్‌ఎస్‌ చరిత్రలో ఇదే తొలిసారి

గత నెలలో అనారోగ్యానికి గురైన నలుగురు వ్యోమగాములను నాసా అత్యవసరంగా భూమికి తిరిగి రప్పించింది. వారు చేరుకున్న వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స ప్రారంభించారు. అయితే వారి వ్యక్తిగత వివరాలు, ఆరోగ్య పరిస్థితి గురించి నాసా గోప్యత పాటిస్తూ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. అంతరిక్ష ప్రయోగాల్లో నిమగ్నమైన వ్యోమగాములను మధ్యలోనే వెనక్కి రప్పించడం ఐఎస్‌ఎస్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఐఎస్‌ఎస్‌లో నాలుగు స్థానాలు ఖాళీ కావడంతో ప్రయోగాలకు అంతరాయం కలగవచ్చని భావించిన నాసా, వెంటనే కొత్త బృందాన్ని పంపే చర్యలు చేపట్టింది.

Details

ఐఎస్‌ఎస్‌లో ప్రస్తుతం ముగ్గురు వ్యోమగాములు

ఎలాన్ మస్క్ సారథ్యంలోని స్పేస్‌ఎక్స్ సహకారంతో ఈ మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ముగ్గురు వ్యోమగాములు మాత్రమే విధుల్లో ఉన్నారు. కొత్తగా నలుగురు చేరడంతో వారి సంఖ్య ఏడుకు పెరగనుంది. దీంతో నిలిచిపోయిన ప్రయోగాలు యథావిధిగా కొనసాగుతాయి. వాయిదా పడిన స్పేస్‌వాక్‌లు కూడా మళ్లీ ప్రారంభం కానున్నాయి.

Advertisement