Android 16: ఫోల్డబుల్, టాబ్లెట్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్ 16 బీటా విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్, తన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ 16 బీటా 1ను విడుదల చేసింది.
ప్రస్తుతం పిక్సెల్ స్మార్ట్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వెర్షన్, పెద్ద-స్క్రీన్ డివైజ్‌ల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి రూపొందించారు.
ఇందులో రియల్ టైమ్ లైవ్ అప్‌డేట్ వంటి కీలక ఫీచర్లను చేర్చడంతో పాటు, ఫోల్డబుల్స్, టాబ్లెట్‌లకు ప్రత్యేకంగా అనుకూలతలు కల్పించాయి.
గూగుల్, తన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను ఇన్టిగ్రేట్ చేస్తూ పెద్ద-స్క్రీన్ డివైజ్‌ల అనుభవాన్ని మెరుగుపరచడానికి నూతన మార్గాలను అన్వేషిస్తోంది.
ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఆండ్రాయిడ్ 16ను ప్రత్యేకంగా ఈ డివైజ్‌ల కోసం అనుకూలంగా తీర్చిదిద్దింది.
Details
వినియోగదారులకు ఉపయోగకరం
ఆండ్రాయిడ్ 16లో రియల్ టైమ్ లైవ్ అప్‌డేట్ ఫీచర్ వినియోగదారులకు అత్యంత ఉపయోగకరంగా నిలవనుంది.
దీని ద్వారా రైడ్ షేరింగ్, ఫుడ్ డెలివరీ, కాల్ వ్యవధి, నావిగేషన్ వంటి క్రియాశీల అంశాలను నేరుగా ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది.
ఈ ఫీచర్, యాపిల్ స్మార్ట్‌ఫోన్‌ల లైవ్ యాక్టివిటీ ఫీచర్‌తో సమానంగా ఉంటుంది.
ఆండ్రాయిడ్ 16లో గూగుల్, శాంసంగ్ మధ్య భాగస్వామ్యం కారణంగా శాంసంగ్ అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ వీడియో కోడెక్‌కు స్థానిక మద్దతు లభిస్తోంది.
ఇది హై-ఎండ్ వీడియో ఫైళ్లను మన్నికగా హ్యాండిల్ చేయగల సమర్థతను కలిగి ఉంటుంది.
Details
వినియోగదారుల కోసం మెరుగైన ఇంటరాక్షన్
ఈ కొత్త వెర్షన్‌తో వినియోగదారుల కోసం మరింత సులభమైన ఇంటర్‌ఫేస్, యాక్సెసిబిలిటీ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.
ఇది స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో గూగుల్‌కు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది.
అండ్రాయిడ్ 16 బీటా 1 ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులలో ఆసక్తిని పెంచి, గూగుల్ సాఫ్ట్‌వేర్ రంగంలో కొత్త ఒరవడి సృష్టించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.