తదుపరి వార్తా కథనం

ట్విట్టర్(X) యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక వీడియో, ఆడియో కాల్స్ చేయోచ్చు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 26, 2023
12:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
ట్విట్టర్(X) తమ యూజర్లకు గూడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ట్విట్టర్‌గా పిలిచే X యూజర్లు ఆడియో, వీడియో కాల్స్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
X యాప్ సెట్టింగ్‌లలో వినియోగదారులు ప్రస్తుతం "ఆడియో, వీడియో కాలింగ్‌ని ప్రారంభించు" టోగుల్‌ను కనుగొన్నారని, ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడం ద్వారా యూజర్‌లు ఎవరి నుండైనా కాల్స్‌ను చేయోచ్చని చెప్పింది.
కాల్స్ చేయడానికి ట్విట్టర్‌లో మీసేజ్ బాక్స్‌ను ఓపెన్ చేసి, స్క్రీన్ కుడి ఎగువ మూలలో ఉన్న ఫోన్ ఆఫ్షన్‌పై క్లిక్ చేసి, ఆడియో, వీడియో కాల్స్‌ను ఎంచుకోవచ్చు.
ఫోన్ నంబర్ అవసరం లేకుండా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని గతంలో మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
X లో ఇప్పటి నుండి వీడియో,ఆడియో కాల్స్ చేయోచ్చు
Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh
— Elon Musk (@elonmusk) October 25, 2023