
Google Pixel 8: భారత్‌లో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ఫోన్స్ లాంచ్.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన పిక్సెల్ 8 సిరీస్ ఫోన్ల లాంచ్ కు సిద్ధమైంది. భారత్ లోనూ ఈ ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమైంది.
అక్టోబర్ 4న నిర్వహించే ' మేడే బై గూగుల్'పేరిట నిర్వహించే ఈవెంట్‌లో గూగుల్ తన ప్లాగ్ షిప్ ఫోన్లు అయిన పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోను లాంచ్ చేయనుంది.
తాజాగా దీనికి సంబంధించి గూగుల్ ఇండియా ఎక్స్ ద్వారా ఓ టీజర్‌ను విడుదల చేసింది.
ఇండియన్ మార్కెట్‌లో మూడు ప్రముఖ పిక్సెల్ సిరీస్ జనరేషన్స్‌ను మిస్ చేసిన అనంతరం గతేడాది పిక్సెల్ 7 సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.
అయితే పిక్సెల్ 7 సిరీస్‌కు స్పందన లభించకపోవడంతో పిక్సెల్ 8 సిరీస్‌పై ఆ సంస్థ భారీ అశలనే పెట్టుకుంది.
Details
పిక్సెల్ 8 ప్రొ 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,10200
పిక్సెల్ 8 సిరీస్ ఫోన్లతో పాటు పిక్సెల్ వాచ్ 2, బడ్స్ ప్రోను కూడా గూగుల్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రొ ధర అధికంగానే ఉంటుందని టెక్అవుట్‌లుక్, టెక్ అనలిస్ట్ పరాస్ గుగ్లానీ స్పష్టం చేశారు.
యూరప్ మార్కెట్లో పిక్సెల్ 8, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ పన్నులతో కలిసి దాదాపు రూ.78,000 ఉంటుందని చెబుతున్నారు.
పిక్సెల్ 8 ప్రొ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 1,10,220 గా ఉండనుంది.
ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు తెలియాలంటే లాంచ్ ఈవెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.