Google TV Streamer: అల్ ఇన్ వన్ స్మార్ట్ టీవీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ .. దీని ఫీచర్లు అదుర్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజుల్లో సినిమాలు, టీవీ షోలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ స్ట్రీమింగ్ చేయడం సాధారణంగా మారిపోయింది.
స్మార్ట్ టీవీల ద్వారా టీవీ చూడడమే కాకుండా, పాత టీవీలను కూడా స్మార్ట్‌గా మార్చే స్ట్రీమింగ్ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి.
అందులో గూగుల్ టీవీ స్ట్రీమర్ (Google TV Streamer) ముఖ్యమైనది.
ఇది అధిక పనితీరు, ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఇది పాత స్మార్ట్ టీవీలకు, సాధారణ టీవీలకు కూడా కనెక్ట్ చేయచ్చు. ఇది ఉత్తమ విజువల్, ఆడియో అనుభవాన్ని అందిస్తుంది.
పాత క్రోమ్‌కాస్ట్ డివైజ్‌లతో పోలిస్తే,ఇది కొంచెం ఖరీదైనదే అయినా,అందులోని అధునాతన టెక్నాలజీ ఫీచర్లు,ఎ.ఐ. టూల్స్ దీన్ని అత్యుత్తమ విలువ కలిగిన ఉత్పత్తిగా మార్చేస్తున్నాయి.
ఈ గూగుల్ టీవీ స్ట్రీమర్ ధర,ఇతర వివరాలను తెలుసుకుందాం.
వివరాలు
గూగుల్ టీవీ స్ట్రీమర్ డిజైన్,కనెక్టివిటీ
ఈ డివైజ్ స్లీక్ వెడ్జ్ షేప్ డిజైన్‌తో ఉంది, ఇది సులభంగా టీవీ కింద సెట్ చేయవచ్చు.
పోర్సిలిన్,హేజిల్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. వెనుకవైపు, పవర్ సప్లైకి USB-C పోర్ట్ ఉంటుంది.
ఉత్తమ వీడియో,ఆడియో క్వాలిటీ కోసం HDMI 2.1 పోర్ట్ అందుబాటులో ఉంది.
అయితే HDMI కేబుల్ వేరుగా కొనాలి. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఈథర్‌నెట్ పోర్ట్ కూడా ఉంది. ప్యాకేజీలో USB-A టు USB-C కేబుల్,పవర్ అడాప్టర్ ఉన్నాయి.
వివరాలు
రిమోట్ ఫీచర్స్
గూగుల్ ఈ టీవీ స్ట్రీమర్ రిమోట్‌ను అనేక ఉపయోగకరమైన ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేసింది.
ప్రత్యేక వాల్యూమ్ బటన్లను ఉపయోగించి సౌండ్‌ను సులభంగా నియంత్రించవచ్చు.
కస్టమైజబుల్ స్టార్ బటన్‌ను ఇష్టమైన యాప్ లేదా స్మార్ట్ హోమ్ డివైజ్‌లకు లింక్ చేసి వాటిని నియంత్రించవచ్చు.
గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను తొలగించినప్పటికీ, ఫైండ్-మై-డివైజ్ ఫీచర్‌ను చేర్చింది.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫైండ్ మై డివైజ్ యాప్‌ను ఉపయోగించి డివైజ్‌ను సులభంగా కనుగొనవచ్చు.
వివరాలు
పర్ఫామెన్స్, ఇతర ఫీచర్లు గూగుల్ టీవీ స్ట్రీమర్
గూగుల్ టీవీ స్ట్రీమర్ మీడియాటెక్ MT8696 చిప్‌తో వచ్చింది. ఇది అంతకుముందు వెర్షన్ కంటే 22% వేగంగా పనిచేస్తుంది.
4GB RAM,32GB స్టోరేజ్‌తో, ఇది స్మూత్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. Wi-Fi 5, బ్లూటూత్ 5.1 సపోర్ట్ ఉన్న ఈ డివైజ్ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌తో పనిచేస్తుంది.
ఇది విభిన్న స్ట్రీమింగ్ యాప్‌ల కంటెంట్‌ను ఒకే స్క్రీన్‌లో చూపిస్తుంది.
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్ స్టార్ వంటి యాప్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే, ఇది పర్సనలైజ్డ్ రికమండేషన్లు కూడా అందిస్తుంది.
వివరాలు
పర్సనలైజ్డ్ స్క్రీన్‌సేవర్లు
గూగుల్ ప్లే స్టోర్ నుండి వేలాది యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉచిత ఛానెల్స్‌ను కూడా చూడవచ్చు.
గూగుల్ టీవీ ఫ్రీప్లే ద్వారా ఫ్రీ ఛానెల్స్ కూడా అందించబడతాయి. AI టూల్స్, ముఖ్యంగా జెమిని, పర్సనలైజ్డ్ స్క్రీన్‌సేవర్లను తయారుచేస్తాయి.
ఇది మ్యాటర్, థ్రెడ్-కంపాటబుల్ పరికరాలను సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా స్మార్ట్ లైట్లు, థర్మోస్టాట్లు, కెమెరాలు వంటి పరికరాలను టీవీ ద్వారా నేరుగా నియంత్రించవచ్చు.
వివరాలు
త్వరలో భారతదేశంలో అందుబాటులోకి ..
గూగుల్ టీవీ స్ట్రీమర్ 60FPS వద్ద 4K HDR వీడియోను అందిస్తుంది,
డాల్బీ విజన్, HDR10, HDR10+, HLG మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది.
ఇది డాల్బీ అట్మోస్‌తో కూడి వస్తుంది. పిక్సెల్ బడ్స్ ప్రో 2తో వైర్‌లెస్ స్పేషియల్ ఆడియో అనుభవాన్ని కూడా అందిస్తుంది.
2024 ఆగస్టు 6న లాంచ్ అయిన ఈ డివైజ్, సెప్టెంబర్ 24 నుంచి అఫీషియల్‌గా లభిస్తోంది.
దీనికి 100 డాలర్ల ధర ఉంది. ఇది బెస్ట్ బై, గూగుల్ స్టోర్ ద్వారా ఆన్‌లైన్, స్టోర్లలో లభిస్తుంది.
భారతదేశంలో దీన్ని ప్రకటించారు, కానీ ఇంకా లాంచ్ చేయలేదు. త్వరలో ఇది అందుబాటులో రాబోయే అవకాశం ఉంది.