Page Loader
Intra Circle Roaming: ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం 
ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం

Intra Circle Roaming: ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ సేవలను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మొబైల్‌ సేవలు విస్తృతంగా అందుబాటులో ఉన్నప్పటికీ, ఇప్పటికీ కొంతమేర మారుమూల గ్రామాల్లో సిగ్నల్‌ సమస్యలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏదో ఒక నెట్‌వర్క్‌ సిగ్నల్‌ మాత్రమే అందుబాటులో ఉంటే, వేరే నెట్‌వర్క్‌ సిమ్‌ కార్డు వాడితే ఫోన్‌ మూగబోయినట్లే. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ సేవలను కేంద్రం తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు, బీఎస్‌ఎన్‌ఎల్‌, జియో, ఎయిర్‌టెల్‌ సిమ్‌ కార్డులు వినియోగించే వినియోగదారులు, డిజిటల్‌ భారత్‌ నిధి (DBN) ద్వారా ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా 4జీ సేవలను పొందవచ్చు.

వివరాలు 

ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ సేవలను ప్రారంభించిన జ్యోతిరాధిత్య సింథియా

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించడానికి కేంద్రం డిజిటల్‌ భారత్‌ నిధి (DBN) కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిని మొదటగా యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ ఫండ్‌గా నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు దీనిని డిజిటల్‌ భారత్‌ నిధిగా మారుస్తూ, టెలికాం సేవల ప్రొవైడర్లు తమ వినియోగదారులకు 4జీ సేవలు అందించే టవర్లు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, టెలికాం మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఇటీవలే ఇంట్రా సర్కిల్‌ రోమింగ్‌ సేవలను ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ టెల్‌, రిలయన్స్ జియో సంస్థలు, డీబీఎన్‌ నిధితో ఏర్పాటైన మౌలిక సదుపాయాలను పంచుకోవాలని ముందుకొచ్చాయి.

వివరాలు 

35,400 మారుమూల గ్రామాలకు లబ్ధి

ఈ విధంగా, వేర్వేరు నెట్‌వర్క్‌ టవర్ల అవసరం లేకుండా, ఒకే టవర్‌ ద్వారా వివిధ టెలికాం సంస్థల వినియోగదారులు 4జీ సేవలను పొందగలుగుతారు. దేశవ్యాప్తంగా డీబీఎన్‌ నిధితో ఏర్పాటు చేసిన సుమారు 27 వేల టవర్లు ఉన్నాయని, వీటి ద్వారా 35,400 మారుమూల గ్రామాలు లబ్ధి పొందనున్నాయని మంత్రి తెలిపారు. అయితే, ఈ సేవలు డీబీఎన్‌ నిధితో ఏర్పాటైన టవర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉండదు.