LOADING...
CNAP: ట్రూకాలర్‌కు పోటీ? CNAP సిస్టమ్ ట్రయల్ ప్రారంభం
ట్రూకాలర్‌కు పోటీ? CNAP సిస్టమ్ ట్రయల్ ప్రారంభం

CNAP: ట్రూకాలర్‌కు పోటీ? CNAP సిస్టమ్ ట్రయల్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
02:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా ప్రభుత్వం ట్రూ కాలర్ (Truecaller) లాంటి కాలర్ ఐడీ సిస్టమ్‌ను ఇప్పుడు టెస్ట్ చేస్తోంది. దీనిపేరు CNAP- Calling Name Presentation. ఇటీవల మీరు సేవ్ చేయని నంబర్ల నుంచి కాల్ వస్తే, ఫోన్‌లో అకస్మాత్తుగా ఏదో పేరు కనిపిస్తుందా? అది బగ్ కాదు... ఇదే కొత్త CNAP టెస్టింగ్ ప్రభావం. CNAP అసలు ఎలా పని చేస్తుందంటే... ఎవరైనా మీకు కాల్ చేస్తే, ముందుగా ఆ నంబర్‌కు లింక్ అయిన ఆధార్‌లో ఉన్న అసలు పేరు ఫోన్‌లో కనిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత మాత్రమే మీరు కాంటాక్ట్స్‌లో సేవ్ చేసిన పేరు.. అంటే Mom,Office లేదా Plumber లాంటి మీ లేబుల్.. కనిపిస్తుంది.

వివరాలు 

ఎందుకు ఇప్పుడు ఈ మార్పు? 

దాంతో అసలు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న పేరు ముందుగా, మీ సేవ్ చేసిన పేరు తర్వాత వస్తుంది. గత నెలలో ప్రభుత్వం CNAP పోర్టల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దాంతో టెలికాం కంపెనీలు దీనిని యాక్టివేట్ చేయడం మొదలుపెట్టాయి. ఉద్దేశం స్పామ్ కాల్స్ తగ్గించడం,ఫ్రాడ్‌లను అడ్డుకోవడం, అలాగే తెలియని నంబర్ల నుంచి కాల్ వస్తే కొంత విశ్వాసంతో రిసీవ్ చేసుకునేలా చేయడం. ఇప్పటివరకు సేవ్ చేయని నంబర్ వస్తే, అది ఎవరిదో తెలుసుకోవడానికి Truecaller లాంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సి వచ్చేది. అవి కూడా క్రౌడ్‌సోర్స్‌డ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎప్పుడూ యాక్యురేట్ అయి ఉండేవి కావు. కానీ CNAP మాత్రం నేరుగా సిమ్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయిన అధికారిక పేరునే డిస్ప్లే చేస్తుంది.

వివరాలు 

దేశవ్యాప్తంగా రోలౌట్ అయ్యే కొద్దీ వీటిపై చర్చలు

అంతే కాదు,మీ ఫోన్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్స్‌పైనా ఇదే విధానం. మీరు ఏ నిక్‌నేమ్‌తో సేవ్ చేసినా, ముందుగా ఆధార్‌కు లింక్ అయిన పేరు ఫ్లాష్ అవుతుంది... తర్వాతే మీ సేవ్ చేసిన పేరు కనిపిస్తుంది. దీంతో ఇండియాలో కాలర్ ఐడీ పని చేసే విధానం మొత్తం మారిపోతుంది అనడంలో సందేహం లేదు. అయితే, ఈ కొత్త సిస్టమ్‌పై ప్రైవసీ, కరెక్ట్‌నెస్, మన పేరు మార్చుకోవచ్చా లేదా వంటి ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా రోలౌట్ అయ్యే కొద్దీ వీటిపై చర్చలు మరింత పెరిగే అవకాశం ఉంది.

వివరాలు 

ఇప్పటికే స్టార్ట్ అయ్యిన టెస్ట్ ఫేజ్

ప్రస్తుతం CNAP ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌పై యూజర్లకు క్లారిటీ ఇవ్వడం, నమ్మకం పెంచడం. టెలికాం కంపెనీలు దేశమంతా ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తుండడంతో, మీ ఫోన్ స్క్రీన్‌పై ప్రభుత్వ వెరిఫైడ్ పేర్లు ముందుగా కనిపించడం ఇక సాధారణం కానుంది. టెస్ట్ ఫేజ్ ఇప్పటికే స్టార్ట్ అయింది... మరి ఇండియాలో కాలర్ ఐడీ ఎలా కనిపిస్తుందో ఇది పూర్తిగా మారుతున్న దశలో ఉంది.