Page Loader
Grok AI: టెలిగ్రామ్‌లో గ్రోక్‌ ఏఐ అందుబాటు.. ఈ ప్రీమియం యూజర్లకే ప్రత్యేకం!
టెలిగ్రామ్‌లో గ్రోక్‌ ఏఐ అందుబాటు.. ఈ ప్రీమియం యూజర్లకే ప్రత్యేకం!

Grok AI: టెలిగ్రామ్‌లో గ్రోక్‌ ఏఐ అందుబాటు.. ఈ ప్రీమియం యూజర్లకే ప్రత్యేకం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2025
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని కృత్రిమ మేధ (AI) అంకుర సంస్థ 'ఎక్స్‌ఏఐ (xAI)' తన 'గ్రోక్‌' (Grok) చాట్‌బాట్‌ సేవలను విస్తరించింది. ఇప్పటివరకు కేవలం ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌) యూజర్లకు మాత్రమే లభిస్తున్న ఈ సేవలను టెలిగ్రామ్‌ (Telegram) ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువ మందికి ఈ సేవలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

Details

ఏఐ విభాగంలో తీవ్ర పోటీ.. గ్రోక్‌ వ్యూహం! 

కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ సేవల పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. యూజర్లను ఆకర్షించేందుకు టెక్‌ కంపెనీలు కొత్త మోడళ్లను, ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ పోటీలో నిలదొక్కుకోవడానికి గ్రోక్‌ ఏఐ - టెలిగ్రామ్‌తో చేతులు కలిపింది. ఇప్పటికే ఈ సేవలు టెలిగ్రామ్‌లో అందుబాటులోకి వచ్చాయని గ్రోక్‌ తన ఎక్స్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించింది. అయితే ఈ సేవలు కేవలం ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. టెలిగ్రామ్‌ సెర్చ్‌ బార్‌లో "GrokAI" టైప్‌ చేసి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

Details

 టెలిగ్రామ్‌ సవాళ్లు - గ్రోక్‌ వ్యూహాత్మక అడుగు 

టెలిగ్రామ్‌ గత కొంతకాలంగా చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. 2024 ఆగస్టు నుంచి హవాలా మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దాడికి సంబంధించిన అంశాలపై టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్ అరెస్టు కావడం కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ కేసుల ప్రభావంతో టెలిగ్రామ్‌ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది.