LOADING...
Spam calls: స్పామ్‌ కాల్స్‌, ఆన్‌లైన్‌ మోసాలపై టెలికాం సంస్థలకు మార్గదర్శకాలు
స్పామ్‌ కాల్స్‌, ఆన్‌లైన్‌ మోసాలపై టెలికాం సంస్థలకు మార్గదర్శకాలు

Spam calls: స్పామ్‌ కాల్స్‌, ఆన్‌లైన్‌ మోసాలపై టెలికాం సంస్థలకు మార్గదర్శకాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2024
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

స్పామ్, ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను చర్యలు తీసుకోవాలని కోరింది. టెక్నాలజీ అభివృద్ధితో పాటు వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో స్పామ్ మెసేజ్‌లు, కాల్స్, ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని సంస్థ ప్రకటించింది. ఈ మోసాలను అరికట్టేందుకు, ట్రాయ్‌ తగిన చర్యలు తీసుకోవాలని ఎయిర్‌టెల్‌ అభ్యర్థించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, టెలికాం ఆపరేటర్లతో కలిసి యాంటీ స్పామ్ ఎకోసిస్టమ్‌ను తయారు చేయడానికి సరైన నియమాలను రూపొందించాలని సూచించింది. స్పామ్ నివారణ కోసం బిజినెస్ వెరిఫికేషన్, డేటా షేరింగ్ వంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈ మోసాలను కొంతవరకు అరికట్టవచ్చని స్పష్టం చేసింది.

Details

టెలికాం శాఖకు లేఖ రాసిన సీవోఏఐ

అంతే కాకుండా, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, ప్రొమోషనల్ కాల్స్ లేదా ఐచిత వాణిజ్య కాల్స్ వంటి ఇబ్బందులను తగ్గించేందుకు త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయాలని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే వెల్లడించారు. వినియోగదారులకు కలిగే ఇబ్బందుల్ని తగ్గించేందుకు, 2024 జూన్‌లో ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించింది. అయితే వాటిని అంగీకరించి, తుది మార్గదర్శకాలను త్వరలో నోటిఫై చేయాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా టెలికం శాఖకు లేఖ రాసింది.