ChatGPT: చాట్‌జీపీటీ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా సేవల్లో అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
అత్యంత ప్రజాదరణ పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌లో ఒకటైన చాట్‌జీపీటీ,సేవలకు అంతరాయం ఎదురైంది.
ఈ కారణంగా, యూజర్లు సమస్యలను ఎదుర్కొంటున్నారు.గతంలో కూడా చాట్‌జీపీటీలో ఇలాంటి సమస్యలు చోటు చేసుకున్నాయి.
అయితే, ఇటీవల చాట్‌జీపీటీ వినియోగం విస్తృతంగా పెరిగిన కారణంగా,ఈ ప్లాట్‌ఫారంపై ఆధారపడిన వినియోగదారులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రస్తుతం చాట్‌జీపీటీ సేవలు నిలిచిపోవడం వల్ల వినియోగదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఎక్స్ వేదికగా, చాట్‌జీపీటీకి ట్యాగ్ చేస్తూ తమ సమస్యలను ఫిర్యాదు చేస్తున్నారు.
అయితే, చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ ఇప్పటివరకు ఈ సమస్యపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఈసేవల్లో అంతరాయం ఎప్పుడు తొలగుతుందో స్పష్టత లేకపోవడంతో వినియోగదారుల్లో ఆందోళన పెరుగుతోంది.దీనిపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చాట్‌జీపీటీ డౌన్
ChatGPT is down. But smart businesses don't rely on just one AI tool. pic.twitter.com/KTmefujqgL
— Ben Macdonald (@BenMacAi) January 23, 2025