LOADING...
Tech Tips: మీ ఫోన్‌లో ఈ మూడు యాప్‌లు ఉంటే ప్రమాదమే.. డేటా లీక్‌పై నిపుణుల హెచ్చరిక!
మీ ఫోన్‌లో ఈ మూడు యాప్‌లు ఉంటే ప్రమాదమే.. డేటా లీక్‌పై నిపుణుల హెచ్చరిక!

Tech Tips: మీ ఫోన్‌లో ఈ మూడు యాప్‌లు ఉంటే ప్రమాదమే.. డేటా లీక్‌పై నిపుణుల హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
11:48 am

ఈ వార్తాకథనం ఏంటి

మీ మొబైల్‌లో కొన్ని యాప్‌లు ఉంటే అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎందుకంటే అవి మీకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను లీక్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఏది పడితే ఆ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఈ మూడు రకాల యాప్‌లు మీ మొబైల్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయడం మంచిదని సూచిస్తున్నారు. నేటి రోజుల్లో స్మార్ట్‌ ఫోన్‌లు మన వ్యక్తిగత సమాచారానికి అతిపెద్ద నిల్వలుగా మారాయి. చాలా మంది తమ ఫోన్‌లో ఉన్న యాప్‌లు పూర్తిగా సురక్షితమేనని, తమ డేటాపై పూర్తి నియంత్రణ ఉందని భావిస్తుంటారు. కానీ వాస్తవంగా చూస్తే, రోజువారీ వినియోగంలో ఉండే అనేక యాప్‌లు వినియోగదారులకి తెలియకుండానే వారి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి.

Details

సున్నితమైన సమాచారం ఆపహరణ

కానీ వాస్తవంగా చూస్తే, రోజువారీ వినియోగంలో ఉండే అనేక యాప్‌లు వినియోగదారులకి తెలియకుండానే వారి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఇందులో యూజర్ లొకేషన్, పరికర వివరాలు, యాప్ వినియోగ అలవాట్లు, బ్రౌజింగ్ ప్యాటర్న్స్ వంటి కీలక డేటా ఉంటుంది. ఈ డేటా యాప్‌ల ద్వారా థర్డ్‌ పార్టీ సర్వర్‌లకు చేరుతుంది. అక్కడ ప్రకటనల లక్ష్యీకరణ నుంచి యూజర్ ప్రొఫైలింగ్ వరకూ విస్తృతంగా వినియోగిస్తారు. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, మీరు ఈ మూడు రకాల యాప్‌లను ఉపయోగిస్తే మీ డేటా పూర్తిగా సురక్షితంగా ఉండకపోవచ్చు.

Details

ఉచిత VPN యాప్‌లు

అత్యంత పెద్ద ప్రమాదం ఉచిత VPN యాప్‌లతోనే ఉంది. ఇవి మీ గుర్తింపును దాచేస్తాయని, ఇంటర్నెట్ వినియోగాన్ని సురక్షితంగా చేస్తాయని ప్రచారం చేస్తాయి. కానీ వాస్తవంలో అనేక ఉచిత VPN సేవలు యూజర్ ఆన్‌లైన్ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తాయి. మీరు ఏ వెబ్‌సైట్‌లు చూస్తున్నారు, ఏ యాప్‌లు ఉపయోగిస్తున్నారు అన్నీ రికార్డ్ చేస్తాయి. చాలాసార్లు ఈ డేటాను అమ్మడం ద్వారానే అవి ఆదాయం పొందుతాయి.

Advertisement

Details

అనవసరమైన యుటిలిటీ యాప్‌లు

ఫ్లాష్‌లైట్, క్లీనర్, బూస్టర్ వంటి యాప్‌లు కూడా ఆందోళన కలిగించే అంశమే. నేటి స్మార్ట్‌ఫోన్‌లలో ఫ్లాష్‌లైట్ వంటి ఫీచర్లు ముందే ఉంటాయి. అయినా కూడా చాలా మంది విడిగా ఇలాంటి యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు. సాధారణ ఫ్లాష్‌లైట్ లేదా క్లీనర్ యాప్‌కు లొకేషన్, స్టోరేజ్, ఇంటర్నెట్ యాక్సెస్ వంటి అనుమతులు ఎందుకు అవసరమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ యాప్‌లు ఫోన్‌ను శుభ్రం చేయడానికంటే ముందే యూజర్ అలవాట్లు, డేటాను ట్రాక్ చేయడంపై ఎక్కువగా దృష్టి పెడతాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Details

ఫోటో ఎడిటింగ్, బ్యూటీ ఫిల్టర్ యాప్‌లు

ఫోటో ఎడిటింగ్, ఫేస్ ఫిల్టర్ యాప్‌లు కూడా యూజర్ ప్రైవసీకి ముప్పుగా మారుతున్నాయి. ఇవి తరచుగా ఫోటోలు, ముఖానికి సంబంధించిన డేటాను తమ సర్వర్‌లకు అప్‌లోడ్ చేస్తాయి. ఆ డేటాను ఎప్పుడు, ఎలా తొలగిస్తారన్నది చాలా సందర్భాల్లో స్పష్టంగా ఉండదు. ముఖ డేటా దుర్వినియోగమైతే యూజర్ డిజిటల్ గుర్తింపుకు తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉంది.

Details

జాగ్రత్తలు తప్పనిసరి

ఏ యాప్‌కు అవసరమైన అనుమతులు మాత్రమే ఇవ్వడం చాలా ముఖ్యం. మీ ఫోన్ సెట్టింగ్‌లలోని ప్రైవసీ లేదా పర్మిషన్ మేనేజర్ ద్వారా ఏ యాప్‌లు నిరంతరం లొకేషన్ లేదా బ్యాక్‌గ్రౌండ్ ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నాయో తనిఖీ చేయాలి. వాటి ఉపయోగానికి సంబంధం లేని అనుమతులు ఉన్న యాప్‌లను పరిమితం చేయడం లేదా పూర్తిగా తొలగించడం ఉత్తమం. కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు దాని రివ్యూలు, అనుమతులు తప్పనిసరిగా పరిశీలించాలి. అలాగే ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండటం ద్వారా కూడా మీ డేటా భద్రతను పెంచుకోవచ్చు.

Advertisement