Page Loader
ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా.. దిల్లీ వాసుల నుండి హాయ్ సందేశం..!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా.. దిల్లీ వాసుల నుండి హాయ్ సందేశం..!

ISS: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో శుభాంశు శుక్లా.. దిల్లీ వాసుల నుండి హాయ్ సందేశం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప ఘట్టంగా,భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు పయనమయ్యారు. ప్రస్తుతం ఆయన ఐఎస్ఎస్ లోని పరిశోధనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు దేశ రాజధాని అయిన దిల్లీ వాసులు "హాయ్" అంటూ గగనతలమే వేదికగా అభివాదం తెలిపారు. ఇదెలా సాధ్యమయ్యిందని ఆశ్చర్యపడుతున్నారా? భూమి నుంచి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో నిరంతరం చుట్టే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం,సోమవారం అర్థరాత్రి అనంతరం దిల్లీ నగర ఆకాశంలో మెరుస్తూ ప్రయాణించింది. దీన్ని అక్కడి ప్రజలు స్పష్టంగా గమనించారు.కొంతమంది ఈ అరుదైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి, సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వివరాలు 

భూమి నుంచి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో..

భవిష్యత్తులో కూడా ఐఎస్‌ఎస్‌ భారత గగనతలం మీదుగా మరెన్నో సార్లు ప్రయాణించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పుడు కూడా ప్రజలకు ఇది కనుచూపు దాకా కనిపించే అవకాశముంది. ఆకాశంలో ప్రకాశించే వస్తువుల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మూడవ అతిపెద్దదిగా గుర్తించబడుతోంది. ఇది మానవులు నివసించగలిగే విధంగా రూపుదిద్దుకున్న మానవ నిర్మిత ఉపగ్రహం. భూమి నుంచి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ వలయ కక్ష్యలో ఇది చక్కర్లు కొడుతోంది. ఒక్కసారి భూమిని చుట్టడానికి దాదాపు 93 నిమిషాలు పడుతుంది.అంటే, రోజుకు సుమారు 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ కేంద్రాన్ని అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా,కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

వివరాలు 

ఐఎస్‌ఎస్‌ భారత ఆకాశంలో పలుమార్లు ప్రత్యక్షమైంది

వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు భూమి నుంచి ఇక్కడికి వెళ్లి నెలల తరబడి పరిశోధనలు కొనసాగిస్తుంటారు. జూన్ 25వ తేదీన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కూడా ఐఎస్‌ఎస్‌లో చేరారు. ఇంతకుముందు కూడా ఐఎస్‌ఎస్‌ భారత ఆకాశంలో పలుమార్లు ప్రత్యక్షమైంది. ఇది సూర్యకాంతిని ప్రతిబింబించినప్పుడు, భూమిపై నుంచి దీన్నిక్రియాశీలంగా గమనించవచ్చు. చంద్రుడి తరహాలో దీని ప్రకాశం మనకు కనిపిస్తుంది. అయితే, చంద్రుడిని పోలి ఎక్కువ ప్రకాశించకపోవడంతో పగటి సమయంలో దీన్ని కనిపెట్టడం కష్టం. కానీ, నాసా వెల్లడించిన సమాచారం ప్రకారం రాత్రి సమయంలో ఇది మెరుస్తూ స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ గగనతలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం