Page Loader
2023లో స్మార్ట్‌ఫోన్ తయారీలో వినియోగదారులు ఆశిస్తున్న మార్పులు
2023లో స్మార్ట్‌ఫోన్ తయారీలో ఆశిస్తున్న మార్పులు

2023లో స్మార్ట్‌ఫోన్ తయారీలో వినియోగదారులు ఆశిస్తున్న మార్పులు

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 31, 2022
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022 స్మార్ట్‌ఫోన్ తయారీలో పెద్దగా మార్పులు రాలేదు. అన్నీ బ్రాండ్లు పెద్దగా మార్పులు లేని విభిన్న వెర్షన్ స్మార్ట్ ఫోన్లు అందించాయి. అయితే 2023లో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు నుండి వినియోగదారులు కోరుకునే మార్పులు ఏంటో చూద్దాం. చాలా మంది కొనుగోలుదారులు Xiaomi 11i 5G,11i హైపర్‌ఛార్జ్ 5G మధ్య వ్యత్యాసాన్ని కనుక్కోలేకపోతున్నారు. Xiaomi తన సబ్-బ్రాండ్ Pocoతో కూడా అదే చేసింది, ఇది డజన్ల కొద్దీ పెద్దగా వృత్యాసం లేని రీబ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూనే ఉంది. అయితే వీటి వల్ల బ్రాండ్ వాల్యూతో పాటు ఆదాయాన్ని కోల్పోయింది. 2023లో Xiaomi తన స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను తగ్గించి, స్పష్టమైన వ్యూహంలో భాగంగా ప్రయోజనకరమైన మోడళ్లను అందించాలి.

స్మార్ట్ ఫోన్

2022 లో ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ సామ్ సంగ్ Z ఫ్లిప్

ఐఫోన్ 14 ప్లస్ కు అదే పరిస్థితి గత కొన్ని సిరీస్ గా అన్నీ మోడల్స్ ను ఒకే మాదిరిగా ఆపిల్ ఉత్పత్తి చేస్తుంది. పైగా మిగిలిన ఫోన్లతో పోలిస్తే అత్యంత ఖరీదైన బ్రాండ్ ఇది. ఆపిల్ మినీని 2023లో ఐఫోన్ లైనప్‌కి తిరిగి తీసుకొచ్చి మిగిలిన సిరీస్ ఆపేస్తే అ బ్రాండ్ కు ఉన్న విలువ అలానే ఉంటుంది. సామ్ సంగ్ Z ఫ్లిప్ 2022 లో ఒక ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ కానీ ధర 90,000 మరి ఎక్కువ అని కొనుగోలుదార్లు అభిప్రాయ పడుతున్నారు. ధర 50,000 నుండి 55,000 ఉంటే ఇటువంటి ప్రత్యేకమైన మొట్టమొదటి మడతపెట్టే స్మార్ట్ ఫోన్ కచ్చితంగా హిట్ అవుతుంది.