Loading...
solar eclipse: సూర్యగ్రహణం వచ్చేస్తోంది.. గ్రహణ మార్గాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారంటే!
సూర్యగ్రహణం వచ్చేస్తోంది.. గ్రహణ మార్గాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారంటే!

solar eclipse: సూర్యగ్రహణం వచ్చేస్తోంది.. గ్రహణ మార్గాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారంటే!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూర్య గ్రహణం రాబోతోంది.. అసలు గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది? దాని మార్గాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారన్నది ఆసక్తికరం. శక్తివంతమైన కంప్యూటర్‌ నమూనాలు, అత్యంత ఖచ్చితమైన కొలతలతో గ్రహణం ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తుందో ఏళ్ల ముందే అంచనా వేయగలరు. అంతేకాదు.. గ్రహణ మార్గాన్ని దశాబ్దాలు,వేల సంవత్సరాల ముందుగానే లెక్కించగలరు. ప్రస్తుతం మైఖేల్‌ జైలర్‌ అనే గ్రహణ వీక్షకుడు 'ఓషన్‌ ఎక్స్‌ప్లోరర్‌' అనే పరిశోధనా నౌకలో గ్రీన్‌లాండ్‌ ఫియోర్డ్స్‌ వైపు ప్రయాణిస్తున్నారు. బుధవారం జరగనున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించడమే ఆయన ప్రధాన లక్ష్యం. అయితే ఈసారి ఆయన మరో అరుదైన దృశ్యాన్ని కూడా చూడాలని ఆశిస్తున్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ఆకాశంలో అరోరా కనిపించడాన్ని తొలిసారిగా నమోదు చేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివరాలు 

సూర్యగ్రహణం కోసం రెండు దశాబ్దాలుగా మ్యాపింగ్‌.. జైలర్‌ ఆసక్తికర ప్రయాణం

అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న పెర్సీడ్‌ ఉల్కాపాతం నుంచి కొన్ని ఉల్కలు కూడా కనిపిస్తాయేమోనని ఎదురుచూస్తున్నారు.

సూర్యగ్రహణం, అరోరా, ఉల్కలను ఒకేసారి చూడటం మాత్రం అదృష్టంపై ఆధారపడి ఉంటుంది.

కానీ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూడటానికి మాత్రం అదృష్టం అవసరం లేదు.

ఎందుకంటే శాస్త్రవేత్తలు ఖచ్చితమైన కొలతలు, ఆధునిక కంప్యూటర్‌ నమూనాలతో చంద్రుడి నీడ భూమిపై ఎక్కడ పడుతుందో ముందుగానే గుర్తించగలరు.

జైలర్‌ రెండు దశాబ్దాలకు పైగా గ్రహణాల మ్యాపింగ్‌ చేస్తున్నారు.

ఆయన 'EclipseAtlas.com' వెబ్‌సైట్‌ వ్యవస్థాపకుడు. ప్రజలు సూర్యగ్రహణాలను ఎక్కడి నుంచి వీక్షించాలో తెలుసుకునేందుకు సంపూర్ణ గ్రహణం కనిపించే మార్గాన్ని చూపించే మ్యాప్‌లను రూపొందిస్తున్నారు.

1991లో తొలిసారి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూసిన ఆయన.. అప్పటి నుంచి గ్రహణాలను వీక్షించడంలో ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.

వివరాలు 

ఈ గ్రహణ మ్యాప్‌ల వెనుక వేల ఏళ్ల శాస్త్రం.. ఎలా రూపొందిస్తారంటే?

"శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని,మ్యాప్‌ అందాన్ని కలపడం నా లక్ష్యం. ఒక గ్రహణ మ్యాప్‌ ఉపయోగకరంగా ఉండాలంటే ముందుగా అది పూర్తిగా కచ్చితంగా ఉండాలి.అదే సమయంలో ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పగలగాలి" అని జైలర్‌ తెలిపారు.

జైలర్‌ రూపొందించే గ్రహణ మ్యాప్‌ల వెనుక వేల ఏళ్ల ఖగోళ పరిశీలనలు, గణిత లెక్కలు ఉన్నాయి.

భూమి, చంద్రుడు, సూర్యుడి వ్యవస్థపై మరింత ఖచ్చితమైన కొలతలు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

వీటి ఆధారంగా చంద్రుడి నీడ భూమిపై ఏ ప్రాంతంలో పడుతుందో, అక్కడి ప్రజలు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఎక్కడి నుంచి చూడగలరో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

చంద్రుడి నీడ ఎక్కడ పడుతుంది? అక్కడే సంపూర్ణ సూర్యగ్రహణం!

సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి కాంతిని కొంతకాలం అడ్డుకుంటాడు.

దీంతో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది.దీనినే సూర్యగ్రహణం అంటారు.

చంద్రుడి వ్యాసం సుమారు 2,159 మైళ్లు (3,475 కిలోమీటర్లు) మాత్రమే. భూమితో పోలిస్తే చంద్రుడు చాలా చిన్నవాడు.

అందుకే చంద్రుడి అత్యంత చీకటి నీడ 'అంబ్రా' కొన్ని వందల కిలోమీటర్ల వెడల్పుతో మాత్రమే ఉంటుంది.

చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతున్నప్పుడు ఈ ఇరుకైన నీడ భూమి ఉపరితలంపై కదులుతుంది.

ఈ ప్రాంతాన్నే 'పాత్‌ ఆఫ్‌ టోటాలిటీ' లేదా సంపూర్ణత మార్గం అంటారు.

ఈ సంపూర్ణత మార్గంలో ఉన్నవారికి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది.

కొద్దిసేపు ఆకాశం చీకటిగా మారి, చంద్రుడి నీడ వెనుక సూర్యుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు.

ADVERTISEMENT

వివరాలు 

ఈ దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం.. ఇక్కడ పాక్షికమే!

ఈ ఏడాది సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, ఉత్తర స్పెయిన్‌తో పాటు ఈశాన్య పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించనుంది.

సంపూర్ణత మార్గానికి బయట ఉన్న ప్రాంతాల్లో చంద్రుడి వెలుపలి పలుచని నీడ 'పెనుంబ్రా' పడుతుంది. అక్కడి ప్రజలకు పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే కనిపిస్తుంది. అంటే సూర్యుడి కాంతిలో కొంత భాగం మాత్రమే చంద్రుడు అడ్డుకుంటాడు.

ఈ ఏడాది యూరప్‌, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనిపించనుంది.

వివరాలు 

సూర్యగ్రహణం ఎక్కడ, ఎంతసేపు కనిపిస్తుంది? ప్రాంతాల వారీగా సమయాలు

సూర్యగ్రహణం పూర్తిగా కనిపించే మార్గం దాదాపు 5,157 మైళ్లు (8,300 కిలోమీటర్లు) ఉంటుంది.

ఇది ఆర్కిటిక్‌ తీర ప్రాంతం మీదుగా మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రారంభమై, మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బాలెరిక్‌ దీవుల సమీపంలో ముగుస్తుంది.

అయితే సంపూర్ణ గ్రహణం కనిపించే సమయం ప్రాంతాన్ని బట్టి మారుతుంది.

ఉదాహరణకు ఐస్‌లాండ్‌లోని రేక్యావిక్‌లో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.48 గంటలకు సంపూర్ణత ప్రారంభమై దాదాపు ఒక నిమిషం ఉంటుంది.

స్పెయిన్‌లోని లియోన్‌లో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.28 గంటలకు ప్రారంభమై సుమారు రెండు నిమిషాలు కొనసాగుతుంది.

మీ ప్రాంతంలో గ్రహణం ఎప్పుడు, ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి 'Time and Date' వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చు.

వివరాలు 

గ్రహణ మ్యాప్‌లతో ప్రత్యేక దృశ్యాలు.. మరింత ఖచ్చితత్వం దిశగా శాస్త్రవేత్తలు

గ్రహణ మ్యాప్‌లు గ్రహణాన్ని చూడటానికి ఎక్కడ ఉండాలో కూడా నిర్ణయించుకునేందుకు ఉపయోగపడతాయి.

కొంతమంది గ్రహణ వీక్షకులు సంపూర్ణత మార్గం మధ్యలో కాకుండా అంచుల వద్ద నుంచి చూడటానికి ఇష్టపడతారు.

అక్కడ కొన్ని ప్రత్యేక దృశ్యాలు కనిపించే అవకాశం ఉంటుంది. వాటిలో 'బైలీస్‌ బీడ్స్‌' ఒకటి.

చంద్రుడి అసమానమైన అంచుల మధ్య ఉన్న చిన్న ఖాళీల నుంచి సూర్యకాంతి ఒక్కసారిగా మెరుస్తూ కనిపించడాన్ని బైలీస్‌ బీడ్స్‌ అంటారు.

అయితే సంపూర్ణత మార్గానికి సంబంధించిన మ్యాప్‌లు చాలా వరకు ఖచ్చితంగా ఉన్నప్పటికీ, వాటిలో మరింత మెరుగుదలకు అవకాశం ఉంది.

వివరాలు 

గ్రహణ మార్గం అంచనాల్లో స్వల్ప మార్పులు.. కారణం ఇదే

ప్రస్తుతం గ్రహణ మార్గాన్ని సుమారు ఒక కిలోమీటరు నుంచి ఒకటిన్నర కిలోమీటరు వరకు ఖచ్చితత్వంతో అంచనా వేయగలుగుతున్నామని నాసా గాడర్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌కు చెందిన సౌర భౌతిక శాస్త్రవేత్త అలెక్స్‌ యంగ్‌ తెలిపారు.

ప్రస్తుతం మీటర్ల స్థాయి వరకు ఖచ్చితత్వం సాధించలేకపోయామని, భవిష్యత్తులో ఆ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.

2024 ఏప్రిల్‌లో మెక్సికో,అమెరికా,కెనడా నుంచి కనిపించిన సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా చేసిన లెక్కలను యంగ్‌ ఉదాహరణగా చెప్పారు.

ఆ లెక్కల్లో సూర్యుడి వ్యాసార్థం గతంలో అంచనా వేసిన దానికంటే కొద్దిగా భిన్నంగా ఉన్నట్లు తేలింది.

ఈ స్వల్ప తేడా కారణంగా కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించే ప్రాంతం సరిహద్దుల్లో మార్పు వచ్చినట్లు గుర్తించారు.

వివరాలు 

తదుపరి సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడంటే?

అంతరిక్షంలో పనిచేస్తున్న అనేక సౌర పరిశోధనా మిషన్లు నిరంతరం సమాచారాన్ని అందిస్తున్నాయని, వాటి ద్వారా భవిష్యత్తులో మరింత ఖచ్చితమైన లెక్కలు సాధ్యమవుతాయని యంగ్‌ తెలిపారు.

బుధవారం జరిగే ఈ గ్రహణం తర్వాత తదుపరి సంపూర్ణ సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న సంభవించనుంది.

అది ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో కనిపిస్తుంది.

అమెరికాలోని కొన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించాలంటే 2044 ఆగస్టు 23 వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

వివరాలు 

సారోస్‌ సైకిల్‌.. సూర్యగ్రహణ మార్గాన్ని ముందే ఎలా అంచనా వేస్తారు?

సంపూర్ణ సూర్యగ్రహణాలు ఎప్పుడూ ఒకే మార్గంలో మళ్లీ కనిపించవు.అయితే భూమి,సూర్యుడు, చంద్రుడు దాదాపు ప్రతి 18ఏళ్లకు ఒకసారి ఒక ప్రత్యేక క్రమంలోకి రావడం వల్ల ఇలాంటి గ్రహణాలు ఒక చక్రాన్ని అనుసరిస్తాయి.

భూమి తన అక్షంపై తిరగడం వల్ల గ్రహణ మార్గం కొన్ని డిగ్రీలు అటూ ఇటూ మారుతుంది అని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన అంతరిక్ష ప్లాస్మా శాస్త్రవేత్త ఫిలిప్‌ ఎస్కూబెట్‌ తెలిపారు.

ఈచక్రాన్ని'సారోస్‌ సైకిల్‌'అని పిలుస్తారు. ప్రాచీన బాబిలోనియన్లు దీనిని తొలిసారిగా నమోదు చేసినట్లు యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ తెలిపింది.

క్రీస్తుపూర్వం కాలంలో వారు మట్టిపలకలపై ఆకాశంలోని వస్తువులు,గ్రహాల కదలికలను నమోదు చేసేవారు.

ఈచక్రం ఆధారంగా సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుందో ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ముందుగానే అంచనా వేయగలుగుతున్నారు.

వివరాలు 

గ్రహణం సమయాన్ని నిమిషం ముందే ఎలా అంచనా వేస్తారు?

"చంద్రుడి నీడలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా పోయే ప్రాంతంలో ఉంటే, అద్భుతమైన దృశ్యాన్ని చూడటం ఖాయం. ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ నమూనాలతో గ్రహణం ఎప్పుడు జరుగుతుందో ఒక నిమిషం వరకు ఖచ్చితంగా అంచనా వేయగలుగుతున్నాం" అని ఎస్కూబెట్‌ చెప్పారు.

చంద్రుడు లేదా భూమి కక్ష్యలో మార్పు వస్తేనే ఈ లెక్కల్లో భారీతేడా వస్తుందని ఆయన వివరించారు.

అయితే వాటి కక్ష్యలను మార్చేంత పెద్ద గ్రహశకలం ఢీకొనే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు.

అంతరిక్షంపై మన అవగాహన పెరుగుతున్న కొద్దీ గ్రహణాలఅంచనాలు కూడా మరింత ఖచ్చితంగా మారుతున్నాయి.

1610లో గెలీలియో చంద్రుడు పూర్తిగా గుండ్రంగా లేడని గుర్తించారు.దీంతో గ్రహణ సమయంలో చంద్రుడి నీడ భూమిపై ఎక్కడ పడుతుందో మరింత ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యమైంది.

వివరాలు 

చంద్రుడి దూరం పెరిగితే.. భవిష్యత్తులో సంపూర్ణ సూర్యగ్రహణాలు ఉండవా?

సారోస్‌ చక్రాన్ని ఇప్పటికీ భవిష్యత్తులో సంభవించే గ్రహణాల నమూనాలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు.

అయితే చంద్రుడి కక్ష్యలో స్థానం,భూమికి చంద్రుడి దూరం,సూర్యుడి చుట్టూ భూమి కక్ష్య వంటి అనేక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఈ లెక్కలు చాలా క్లిష్టమైనవి. భూమి భ్రమణం,అంతరిక్షంలోని ఇతర వస్తువుల కదలికలు కాలక్రమంలో మారుతుంటాయి. వాటినీ లెక్కల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దాదాపు 60 కోట్ల సంవత్సరాల తర్వాత చంద్రుడు భూమికి అంత దూరంగా వెళ్లిపోతాడు కాబట్టి మన గ్రహంపై సంపూర్ణ సూర్యగ్రహణాలు కనిపించవని యంగ్‌ తెలిపారు.

చంద్రుడి కదలిక కారణంగా భూమి భ్రమణ వేగం క్రమంగా తగ్గుతోంది. అయితే భూమి భ్రమణ వేగం ఏడాది నుంచి ఏడాదికి ఊహించని విధంగా కూడా మారుతుంది.

వివరాలు 

గ్రహణాల అంచనాలో 'డెల్టా టీ' కీలకం

ఈ మార్పులను పరిగణనలోకి తీసుకునేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు 'డెల్టా టీ' అనే సవరణను ఉపయోగిస్తారు.

భూమి భ్రమణం ఎలా ఉండాలని అంచనా వేశారో, వాస్తవంగా ఎంత వేగంతో తిరుగుతోందో మధ్య ఉన్న చిన్న తేడాను డెల్టా టీ ద్వారా లెక్కిస్తారు.

ఈ తేడా, డెల్టా టీకి సంబంధించిన అనిశ్చితి కారణంగానే గ్రహణాలను అనంతమైన కాలం ముందుగానీ, గతంలో చాలా వెనక్కిగానీ పూర్తిగా ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదు.

సాధారణంగా భవిష్యత్తులో సుమారు 3,000 సంవత్సరాల వరకు, గతంలో దాదాపు 2,000 సంవత్సరాల వరకు గ్రహణాల అంచనాల్లో విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని యంగ్‌ తెలిపారు.

వివరాలు 

గ్రహణాల అంచనాలో 'డెల్టా టీ' కీలకం

అయితే సంపూర్ణ సూర్యగ్రహణం వెనుక ఉన్న ఈ శాస్త్రం కేవలం ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారి కోసమే కాదని గ్రహణ వీక్షకుడు జైలర్‌ అన్నారు.

సంపూర్ణత సమయంలో ఒక్కసారిగా చీకటి కమ్ముకోవడం, చంద్రుడి చుట్టూ సూర్యుడి కాంతివలయం 'కరోనా' కనిపించడం, చుట్టూ అద్భుతమైన కాంతి దృశ్యాలు ఆవిష్కృతం కావడం వల్లే ప్రజలు గ్రహణాలను చూడటానికి ఆసక్తి చూపుతారని ఆయన వివరించారు.

ADVERTISEMENT